జాతీయనేతగా పవన్... ఎప్పుడు.. ఎలా...?
ఇదిలా ఉంటే జనసేనకు ఏమాత్రం సీన్ లేదని అందరూ అనుకుంటే.. అలాంటి జనసేన ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో నూటికి నూరు శాతం విజయం సాధించి.. 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లు గెలిచింది. ఇక పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో జాతీయ నేతగా ఎదిగే అవకాశం ఉందంటూ.. జాతీయ మీడియా కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలో బిజెపి తరఫున బలమైన గళం వినిపించే నాయకుడు లేడు. ఆ గ్యాప్ ను భర్తీ చేసేందుకు పవన్ వంటి వారి వైపు కమల నాథులు చూస్తున్నారని.. జాతీయ వర్గాల అభిప్రాయం.
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ, కేరళ ప్రాంతాల్లో బిజెపి బలంగా పునాదులు వేసుకోవడం ఎప్పటిలో సాధ్యం కాదు. ఒక కర్ణాటక మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా ఉండగా.. తెలంగాణలో మాత్రం ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉన్నా. అది నిలుపుకుంటారన్న గ్యారెంటీ లేదు. వచ్చే ఎన్నికలనాటికి జెమిలీ ఎన్నికలు వస్తే.. బిజెపి దక్షిణ రాష్ట్రాల పైన ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. బిజెపి గెట్టి ప్రయత్నాలు చేస్తుంది. అటు ఉత్తరాదినా కాంగ్రెస్ బలంగా పుంజుకుంటుంది. అందుకే దక్షిణాదిపై కొన్నాళ్లుగా మోడీ, అమిత్‌షా బాగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఎక్కువ నిధులు ఇస్తూ వస్తున్నారు.
ఇలాంటి తరుణంలో పవన్ ఉంటే సనాతన ధర్మ పరిరక్షకులను బాగా ఎంకరేజ్ చేయటం ద్వారా.. అవసరమైతే పవన్ కు మరింత ప్రయారిటీ ఇచ్చి బిజెపిలో జనసేన ను విలీనం చేసుకోవడం ద్వారా.. పవన్ కళ్యాణ్‌ను జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేసుకోవాలని బిజెపి అనుకుంటుంది. మరి పవన్ బిజెపితో కలిసి జాతీయ నాయకుడిగా అవతారం ఎత్తుతారా.. లేదా జనసేన నాయకుడిగానే ఉంటారా అన్నది చూడాలి.