రివ్యూయర్స్ పై.. నీచమైన కామెంట్స్ తో ఫైర్ అయిన టాలీవుడ్ నటుడు..!

Divya
ఏ సినిమా విడుదలైనా సరే ఖచ్చితంగా సినిమా రివ్యూస్ అనేటివి రాస్తూ ఉంటారు. వీటివల్ల ఎప్పుడూ కూడా చర్చ జరుగుతూనే ఉంటాయి. రివ్యూల పైన కూడా చాలామంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సినిమా విడుదలైనప్పుడు చిత్ర బృందానికి పాజిటివ్గా రాస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ప్రస్తావించి తప్పులను చూపించారంటే కచ్చితంగా చాలామంది విరుచుకుపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ నటుడుగా పేరుపొందిన శ్రీకాంత్ అయ్యంగారు రివ్యూ రైటర్ల పైన ఫైర్ కావడం జరిగింది. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చాలా అసభ్యకరంగా కనిపిస్తున్నాయి.
ఆయన పొట్టేల్ సినిమాలో నటించారు ఈ సినిమాకి సంబంధించి రివ్యూలు రావడంతో మీడియా ముఖంగా చాలా దూషించారు. పొట్టేల్ సినిమా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ సందర్భంగా రివ్యూ రైటర్ల పైన శ్రీకాంత్ అయ్యంగారు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారుతున్నాయి. దరిద్రానికి విరోచనాలు వస్తే రివ్యూ రైటర్సే వస్తారని జీవితంలో షార్ట్ ఫిలిం కూడా తీసేకి రాని వాళ్ళు కూడా రివ్యూలు ఇస్తున్నారు.. వీరంతా పారాసైడ్స్ అంటే చాలా అసభ్యకరమైన పదాలను ఉపయోగించారు.

సినిమా డ్రాగడ్గా ఉంది అలా ఉంది ఇలా ఉంది అంటూ రివ్యూస్ రాస్తూ ఉంటారని.. సినిమా తీయడం అనేది ఎంత కష్టమో వీళ్ళకేం తెలుసు అంటూ చాలా రేస్ గా మాట్లాడారు.. ప్రేక్షకులు దేవుని లాంటి వారు సినిమా బాగా లేకపోయినా ముందుకు తీసుకువెళ్తారని.. రివ్యూస్ తొక్కలో రివ్యూలు అంటూ మాట్లాడారు. చెమటోడ్చి కష్టపడి సినిమాలు తీస్తూనే ఉంటాము.. ప్రేక్షకులకు సినిమాలు నచ్చుతూనే ఉంటాయి.. మీలాంటి రివ్యూవర్స్  వస్తూ ఉంటారు పోతూ ఉంటారు దుర్వాసన కంటే దరిద్రమంటూ  చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ మారడంతో చాలామంది పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: