సినిమా ఇండస్ట్రీలో దాదాపు ఓకే సమయంలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలుగా కెరియర్ను కొనసాగించిన వారిలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ ఉంటారు. వీరిద్దరు కూడా ఒకే సమయంలో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలతో విజయాలను అందుకుంటు అద్భుతమైన స్థాయిలో కెరీర్లు ముందుకు సాగించారు. మరి వీరిద్దరికీ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకుడు ఒకరు ఉన్నారు. ఆ దర్శకుడు ఎవరు ? ఏ సినిమాలతో వీరిద్దరికీ ఇండస్ట్రీ హిట్లను ఇచ్చాడు అనే వివరాలను తెలుసుకుందాం.
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బి గోపాల్ ఒకరు. ఈయన చిరంజీవి , బాలకృష్ణ ఇద్దరికీ కూడా ఇండస్ట్రీ హిట్లను ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరోగా బి గోపాల్ "సమరసింహా రెడ్డి" అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ భారీ అంచనాలు నడుమ విడుదల అయ్యి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత బి గోపాల్ , బాలకృష్ణ తో నరసింహ నాయుడు అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా బాలకృష్ణ కు , బి గోపాల్ రెండు ఇండస్ట్రీ హిట్లను అందించాడు.
ఇకపోతే బి గోపాల్ , చిరంజీవి కి కూడా ఒక ఇండస్ట్రీ హిట్ ను అందించాడు. కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి హీరోగా రూపొందిన ఇంద్ర మూవీ కి బి గోపాల్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలా ఈ దర్శకుడు చిరంజీవి , బాలయ్య ఇద్దరికీ ఇండస్ట్రీ హిట్లను అందించాడు.