అన్‌స్టాప‌బుల్ 4 : అమ‌రావ‌తి ఎలా ఉండ‌బోతోంది... ఎప్ప‌ట‌కి అవుతుంది.. బాబు మాట‌ల్లోనే...!

RAMAKRISHNA S.S.
బాలకృష్ణ షోలో చంద్రబాబు ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను ఎప్పుడూ తప్పు చేయలేదని అలాగే రాజకీయ కక్షలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చేశారు. అలాగే చట్టాన్ని ఏనాడు తాను ధిక్క‌రించలేదని .. కానీ ఏపీలో కక్ష రాజకీయాలు వచ్చాయి .. అవి వ్యక్తిగత ద్వేషాలుగా మారాయని చంద్రబాబు తెలిపారు. ఇక నా అరెస్టును ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా అని ... ప్రజల అండదండలే తనను గెలిపించాయని చంద్రబాబు తెలిపారు. తాను జీవితంలో ఎన్నో సంక్షేపాలు చూశాను .. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుంటూ సమాజం కోసం పనిచేసుకుంటూ వచ్చానని చంద్రబాబు తెలిపారు. ప్రజాక్షేత్రంలో నంద్యాలలో మీటింగ్ పెట్టి అక్కడి నుంచి నేరుగా బస్సు దగ్గరికి వచ్చి రాత్రి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో బయట రాత్రంతా అలజడి సృష్టించారు .. తర్వాత కిందకు వస్తే ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని చంద్రబాబు తెలిపారు.

వారింట్ ఇస్తున్నాం తర్వాత నోటీసు ఇస్తామని చెప్పారు .. ప్రజాస్వామ్యం లో ఎక్కడ ఇలా జరగలేదు .. జరుగుతుందని ఊహించలేదని చంద్రబాబు తెలిపారు. ఇక బాలకృష్ణ అమరావతి నగరం మీ కల సైబరాబాద్ నిర్మాణం మీ ఘనత అది ఎంత నిజమో ఇప్పుడు అమరావతి నిర్మాణం కల ఎప్పటికి ? ఎలా సహకారం అవుతుందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు ఆన్సర్ చేస్తూ కొన్ని చరిత్రలో నిలిచిపోతాయి.. హైదరాబాద్ నగరాన్ని నిజాం - సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిష్ వాళ్ళు అభివృద్ధి చేస్తే - సైబరాబాద్ను నేను అభివృద్ధి చేశాను అది ఆర్థిక హబ్ గా తయారు చేసేందుకు మంచి అవకాశం వచ్చింది .. ఈరోజు హైదరాబాద్ మహానగరంగా దేశానికి నెంబర్ వన్ సిటీగా తయారయ్యే పరిస్థితి ఉంద‌న్నారు.

ఈ ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారు గత పాలకులు ఎవరు నాశనం చేయలేదు వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఎప్పటికీ కూడా దేశానికి కొన్ని నగరాలు కావాలని ... చండీగఢ్ వచ్చిన తర్వాత ఏ నగరము రాలేదు .. నేను కేంద్రం సహకారంతో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన నగరాన్ని ప్రపంచంలోనే అద్భుత నగరంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచంలోనే గొప్ప నగరాలలో ఒక నగరంగా అమరావతిని చేయాలని తను శ్రీకారం చుట్టినట్టు చంద్రబాబు తెలిపారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: