సోషల్ మీడియాలో జానీ సంచలన పోస్ట్ వైరల్.. అభిమానుల రియాక్షన్ ఇదే!
భవిష్యత్తులో జానీ మాస్టర్ పై నమోదైన కేసు నుంచి కూడా ఆయన కచ్చితంగా బయటపడతారని జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేసి ఉండరని అభిమానులు భావిస్తున్నారు. జానీ మాస్టర్ బ్యాగ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఎదిగారు. అయితే తప్పు చేయకపోయినా కొంతమంది ఆయనను ఈ వివాదంలో ఇరికించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్ బెయిల్ పై విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.
తన సాంగ్ ను ట్రెండింగ్ లో ఉంచినందుకు ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు అని జానీ మాస్టర్ వెల్లడించడం గమనార్హం. తాను కొరియోగ్రాఫర్ గా చేసిన సాంగ్ కు సంబంధించిన వీడియోను జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. భూల్ భూలయ్యా3 సాంగ్ ను ట్రెండింగ్ లో ఉంచినందుకు జానీ మాస్టర్ ఈ కామెంట్లు చేయడం జరిగింది.
రాబోయే రోజుల్లో జానీ మాస్టర్ కెరీర్ ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాలి. జానీ మాస్టర్ కు ఛాన్స్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు ఎంతమేర ఆసక్తి చూపిస్తారనే చర్చ సైతం జరుగుతోంది. జానీ మాస్టర్ కు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జానీ మాస్టర్ కు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయనపై నమోదైన కేసు విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి. జానీ మాస్టర్ త్వరలో మీడియా ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.