ఆన్ స్టాపబుల్ వాటికి అడ్డాగా మారనుందా.. వరుసగా అవే ఎపిసోడ్లు..?

MADDIBOINA AJAY KUMAR
బాలయ్య హోస్ట్ గా కొంత కాలం క్రితం ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో ఆన్ స్టాపబుల్ అనే టాక్ షో ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. బాలయ్య మొట్ట మొదటి సారి ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండడంతో ఈ టాక్ షో స్టార్ట్ కాక ముందే దీనిపై భారీ అంచనాలు జనాల్లో ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన ఈ టాక్ షో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఇప్పటివరకు అన్ స్టాపబుల్ టాక్ షో మొత్తం మూడు సీజన్ లను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఇక నాలుగవ సీజన్ ఈ రోజు నుండి అనగా అక్టోబర్ 25 వ తేదీ నుండి స్టార్ట్ కాబోతోంది. నాలుగవ సీజన్ మొదటి ఎపిసోడ్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా రానున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను కూడా ఆహా బృందం వారు విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది.

ఇకపోతే అన్ స్టాపబుల్ నాలుగవ సీజన్ ఎక్కువ శాతం సినిమా ప్రచారాలకు అడ్డగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇప్పటికే నాలుగవ సీజన్ కి సంబంధించిన కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తి అయింది. అందులో భాగంగా ఒక ఎపిసోడ్ కి లక్కీ భాస్కర్ మూవీ యూనిట్ అంతా వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే కంగువా మూవీ యూనిట్ కూడా అన్ స్టాపబుల్ టాక్ షో కు రానున్నట్లు , వీరికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ను ల కూడా మరికొన్ని రోజుల్లో చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ మూవీ కి సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా ఆన్ స్టాపబుల్ టాక్ షో కు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా అనేక మంది తమ సినిమా ప్రమోషన్ల కోసం ఆన్ స్టాపబుల్ టాక్ షో ను వేదికగా వాడుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: