స్టుపిడ్ ఎఫైర్స్ .. ఆమెని వదులుకొని తప్పు చేసా.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్.?

Pandrala Sravanthi
 అక్కినేని నాగచైతన్య త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక రెండో పెళ్లి చేసుకోబోతున్న వేళ నాగచైతన్య మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.మరి నాగచైతన్య ఎవరి గురించి మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది లైఫ్ లో స్కూల్ డేస్ లవ్, కాలేజ్ డేస్ లవ్ అనేది ఉంటుంది. అలా నాగచైతన్య కి కూడా రెండు లవ్ స్టోరీలు ఉన్నాయట.స్కూల్లో చదువుకునే రోజుల్లోనే ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించారట. ఇక ప్రేమించిన అమ్మాయి స్కూల్ వదిలి వేరే స్కూల్ కి వెళ్ళిన సమయంలో నాగచైతన్య చాలా బాధపడ్డారట.అంతేకాదు ఈయన గుండె పగిలిపోయిందట. ఇక బాధతో నాగచైతన్య ఆమె దగ్గరికి వెళ్లి ఎందుకు ఇలా చేసి వెళ్ళిపోతున్నావు అని కన్నీళ్ళతో అడిగారట.ఇక ఇదే విషయం కాలేజీ లైఫ్ లో కూడా జరిగిందట.

కాలేజీలో చదువుతున్న సమయంలో కూడా తనకి ఇలాగే బ్రేకప్ జరిగింది అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు. అయితే ఈ బ్రేకప్ జరిగిన విషయంలో మీ రిలేషన్స్ లో మీరు ఎమోషనల్ గా ఉంటారా అని యాంకర్ అడగగా..తప్పకుండా ఉంటాను. నేను ప్రేమించిన వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోతుంటే నేను చాలా బాధపడతాను. ఎన్నో రోజులు ఏడ్చాను. నేను ప్రేమించిన వ్యక్తితో ఉన్న అటాచ్మెంట్ ఒక్కసారిగా తెగిపోవడంతో నా బాధ ఎవరికి చెప్పుకోలేక వెక్కివెక్కి ఏడ్చేవాడిని. ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ భరించలేం అంటూ నాగచైతన్య సంచలన కామెంట్లు చేశారు.

అయితే ఈ విషయం గురించి మరింత మాట్లాడుతూ స్కూల్ డేస్ కాలేజ్ డేస్ లో ప్రేమించాను. కానీ ప్రస్తుతం అవి గుర్తుకు వస్తే మాత్రం ఏంటి నేను ఇంత స్టుపిడ్ ఎఫైర్స్ పెట్టుకున్నాను అని అనిపిస్తుంది. వాళ్లు దూరమైన సమయంలో నా లైఫ్ మొత్తం పోయింది.ఇంకా ఏమీ లేదు అనుకున్నాను. కానీ ఇప్పుడు అవి గుర్తొస్తే మాత్రం స్టుపిడ్ ఎఫైర్స్ అనిపిస్తుంది అంటూ నాగచైతన్య చెప్పారు. ఇక నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత దూరమైన సమయంలో కూడా ఆయన చాలా రోజులు ఏడ్చారని నాగార్జున చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: