ప్రభాస్ ఫౌజీ విలన్ తెలుసా .. హను ప్లాన్ మామూలుగా లేదే ..!

Amruth kumar
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ లాంటి హీరో మరొకరు లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా లెవ‌లో తెలుగు సినిమా సత్తా చాటిన రెబల్ స్టార్ తర్వాత పాన్ వరల్డ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడడానికి రెడీ అవుతున్నాడు.. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు విషయంలో చాలా మంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఏదేమైనా కూడా ప్ర‌భ‌స్‌ లాంటి హీరో టాలీవుడ్ కి దొరకటం అదృష్టం.. ఇది ఇలా ఉంటే ప్రభాస్ చేస్తున్న సినిమాలలో హను రాఘవ పూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’  అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరోని తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది .

నిజానికి అయితే హను రాఘవ పూడి ఇంతకు ముందు చేసిన ‘సీతా రామం’ మూవీ క్లాసికల్గా పాన్ ఇండియా లెవెల్లో మంచి విజయం సాధించింది. ఆ సినిమా కారణంగానే ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ప్రభాస్ తో చేసే సినిమాతో తాను కూడా స్టార్ ద‌ర్శ‌కుడిగా మారాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏదేమైనా కూడా ఆయన ఈ సినిమా మీద భారీ కసరత్తుల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక బాలీవుడ్ హీరోని విలన్ గా తీసుకోవాలని ఆలోచన బాగానే ఉంది కానీ.. బాలీవుడ్ హీరోలు విలన్ గా చేస్తే ప్రభాస్‌కి అంత బాగా కలిసి రావటం లేదని వార్తలు కూడా ఇండస్ట్రీలో వైర‌ల్‌ గా మారాయి. ఇప్పటికే ‘ఆదిపురుషు’ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించి మెప్పించలేకపోయాడు . అయినప్పటి కీ సినిమా డిజాస్టర్ అయింది . ఇప్పుడు అదే తరహాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ను ప్రభాస్ ఢీకొట్టే పాత్రలో తీసుకుబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక మరి బాలీవుడ్ హీరోని విలన్ గా తీసుకుని ఒకసారి దెబ్బ తీన‌ ప్రభాస్ ఈసారి కూడా అదే రిపీట్ చేయబోతున్నాడు అనే అనుమానాలు కూడా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరోని ఎదుర్కోవాలి అంటే భారీ విలన్ అయితే ఉండాలి. అలా ఉన్నప్పుడే సినిమా బాగా ఎలివేట్ అవుతుందింది. ముఖ్యంగా సలార్ సినిమాలో ప్రశాంత్ నీల్ ప్రభాస్ చాలా గొప్పగా చూపించాడు. అలా ఫౌజీ సినిమాలో కూడా హను రాఘవ పూడి ప్రభాస్ ని చాలా హై రేంజ్ లో చూపించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే రేంజ్ కి ఎదగడం అనేది నిజంగా మన అదృష్టమనే చెప్పాలి…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: