బాలీవుడ్ స్టార్ హీరోకు జంటగా సమంత.. నార్త్ లో కూడా సెటిల్ అయినట్టే గా..!

Amruth kumar
.... ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
స్టార్ హీరోయిన్ సమంత గురించి కొత్త గా పరిచయం అవసరం లేదు .. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల ను మెప్పించింది .. సౌత్ ఇండస్ట్రీలో నే టాప్ హీరోయిన్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలకు కమిట్ అవుతుంది ..  ఈ క్రమంలో నాగచైతన్యతో విడాకులు ఆ తర్వాత మయో సైట్స్ వరుస ఇబ్బందులు తర్వాత సమంతా  హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చిన శకుంతలం నిరాశ పరిచింది . తర్వాత స్టోరీ ఓరియెంటెడ్ సినిమాల కు కమిట్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది ..
ఇప్పటికే బాలీవుడ్ లో సిటాటిల్ వెబ్ సిరీస్ తో త్వరలోనే ప్రేక్షకులు ముందుగా రానుంది . అలానే బాలీవుడ్ లో స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్ హీరోగా వస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందని అంటున్నారు . బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజకుమార్ హిరానీ డైరెక్షన్ లో ఈ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుంద ని సమాచారం . షారుక్ కు జంట గా నటించేందు కు సమంత కూడా ఓకే చెప్పింద ని అంటున్నారు .

అలాగే  దేశభక్తి నేపథ్యం లో యాక్షన్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాలో నటించేందుకు సమంత ఎంతో ఆసక్తి చూపిస్తుందటట . ఇక త్వరలో నే ఈ సినిమా షూటింగ్ మొద‌లు అవుతుంద ని కూడా అంటున్నారు . వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందు కు తీసుకు రావాలని చిత్ర యూనిట్ సన్న హలు చేస్తుంది . ఇప్ప‌టికే ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న సమంత .. ఈ సినిమా హిట్ అయితే మాత్రం అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా వెలుగుతుంది అనటం లో ఎలాంటి సందేహం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: