ఏపీ ప్రజలకు కూటమి బంపర్ ఆఫర్.. ఆ యాప్ లో క్యాస్ట్ సర్టిఫికెట్ పొందే ఛాన్స్!
నారా లోకేశ్ తన పోస్ట్ లో యువగళం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన మరో హామీ అమలు దిశగా అడుగులు వేస్తున్నానని తెలిపారు. ప్రతి సంవత్సరం క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికెట్ పొందే పద్దతిని అందుబాటులోకి తీసుకొస్తున్నామని లోకేశ్ తెలిపారు. అదే సమయంలో వేర్వేరు బిల్లులు సైతం వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చని లోకేశ్ అన్నారు.
ఏపీ సర్కార్ మెటాతో కీలక ఒప్పందం కుదుర్చుకుందని మెటా ఫ్లాట్ ఫాం వాట్సాప్ బిజినెస్ సహాయంతో ఇకపై క్యాస్ట్ సర్టిఫికెట్ తో పాటు ఇతర సర్టిఫికెట్లను సులభంగా వేగంగా పొందవచ్చని లోకేశ్ కామెంట్లు చేశారు. పారదర్శకంగా ఆన్ లైన్ లో సర్టిఫికెట్ల జారీ జరుగుతుందని నకిలీలు, ట్యాంపరింగ్ కు ఛాన్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని లోకేశ్ చెప్పుకొచ్చారు.
కన్సల్టేషన్ టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్ అమలు, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో మెటా మరిన్ని సిటిజెన్ సర్వీసెస్ ను అందించనుందని ఏపీ సర్కార్ మెటాతో చేసుకున్న ఈ ఒప్పందం చారిత్రాత్మకం అని లోకేశ్ కామెంట్లు చేయడం గమనార్హం. లోకేశ్ వెల్లడించిన ఈ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నారా లోకేశ్ ఏపీ ప్రజలకు మంచి చేసే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఏపీ మంత్రి నారా లోకేశ్ రాబోయే రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలతో ప్రజలకు మరింత మంచి చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.