ఆ ఒక్క పనితో జనాల నోర్లు మూయించిన నందమూరి ఫ్యాన్స్.. జూనియర్ ఎన్టీఆర్ వెరీ హ్యాపీ..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ పేరును ఎలా ట్రోల్ చేస్తున్నారో కొందరు ఆకతాయిలు మనం చూస్తూనే ఉన్నాం.  మరి ముఖ్యంగా పొలిటికల్ పరంగా ఆయన పేరు లాగుతూ ఆయనకు అసలు ఇష్టం లేని మ్యాటర్లో వేలు పెట్టేలా ఆయన పేరుని ప్రస్తావిస్తూ కావాలనే ఆయనను డీగ్రేడ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు . అంతేకాదు ఆయన ఎంతో కష్టపడి నటించిన "దేవర" సినిమా హిట్ అయిన కూడా కొంతమంది ఫ్లాప్ అంటూ దేవర సినిమా కలెక్షన్స్ మొత్తం డమ్మి నే అంటూ మాట్లాడుకుంటూ ట్రోల్ చేస్తున్నారు .


ఇదే క్రమంలో నందమూరి ఫ్యాన్స్ అల ట్రోల్ చేసేవాళ్ళ నోరులు మూయించే పని చేశారు.  దీంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే  జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన సినిమా దేవర . కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కింది.  కాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీలో కన్నడంలో సూపర్ హిట్ అయింది .


తమిళనాడు కేరళలో పర్వాలేదు అనే టాక్ దక్కించుకుంది. సుమారు ఆరు సంవత్సరాల తర్వాత తారక్.. సింగిల్గా హీరోగా నటించిన సినిమా ఇదే కావడంతో జనాలు . ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు. అయితే కొంతమంది దేవర సినిమా అంతా స్టాండర్డ్స్ అందుకోలేకపోయింది అని ఇంకొంచెం బాగా తెరకెక్కించుంటే  బాగుండేది అని కామెంట్స్ చేస్తారు . కాగ జూనియర్ ఎన్టీఆర్ కి కేవలం తెలుగులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే .


మరీ ముఖ్యంగా జపాన్ లో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాగా జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ ఎలా ఉంది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా 2022లో రిలీజ్ అయింది. 2022 మార్చిలో రిలీజ్ అయింది . అయితే జపాన్ లో మాత్రం కాస్త ఆలస్యంగా విడుదల చేశారు ఈ మూవీని. అక్కడ 2022 అక్టోబర్ 22న విడుదలైంది . ఈ సినిమా ఇప్పటికీ అక్కడ థియేటర్స్ లో ఏకధాటిగా ప్రదర్శింపబడుతుందట .


రీసెంట్గా ఈ విషయాన్ని ఆ థియేటర్ యాజమాన్యం ట్వీట్టర్ ద్వారా తెలియజేసింది . మరో వారం రోజులు నడిపించి ఆ తర్వాత ఈ సినిమాని తీసేస్తున్నట్లు ఆ థియేటర్ యాజమాన్యం ప్రకటించింది . థియేటర్లో మరోసారి సినిమాను చూడాలనుకునే వారు త్వరగా చూడండి అంటూ అనౌన్స్ చేసింది.  ఈ క్రమంలోనే జపాన్ లో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో  థియేటర్ వద్ద క్యూ కడుతున్నారు . జపాన్లో విడుదలై రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ సినిమా ఇంకా సక్సెస్ ఫుల్ గా థియేటర్లో రన్ అవుతుంది అంటే అది కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: