అప్పుడు సమంత..ఇప్పుడు శోభిత ధూళిపాళ్ల..అమలకు కోలుకోలేనే షాక్ ఇచ్చారుగా..!

Thota Jaya Madhuri
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. హీరో నాగచైతన్య పేర్లే బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఓ విధంగా చెప్పాలి అంటే మారుమ్రోగిపోతున్నాయి . దానికి కారణం మరి కొద్ది రోజుల్లోనే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు గా మారిపోబోతున్నారు . అసలు మా మధ్య ప్రేమ లేదు దోమ లేదు అంటూ కొట్టి పడేసిన నాగచైతన్య - శోభిత  సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకొని .. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ ఫొటోస్ ని రిలీజ్ చేసి అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు . నాగార్జున కూడా వీళ్ళ ప్రేమ వ్యవహారాన్ని ఎంగేజ్మెంట్ ని అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు . కాగా డిసెంబర్ 4వ తేదీ నాగచైతన్య - శోభిత  పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది.


రీసెంట్ గానే విశాఖలో శోభితా ధూళిపాళ్ల పసుపు దంచే ఫంక్షన్ కంప్లీట్ చేసుకుంది. ఈ ఫంక్షన్ కి సంబంధించిన ఫొటోస్ ను హీరోయిన్ శోభిత  ఇంస్టాగ్రామ్ వేదికగా బయటపెట్టింది . అయితే ఈ ఫొటోస్ లో శోభిత ధూళిపాళ్ల చక్కగా చీర కట్టుకొని పద్ధతిగా నగలు వేసుకొని చేతికి గాజులతో చాలా ట్రెడిషనల్ గా మెరిసింది . అంతకు ముందు వెబ్ సిరీస్లో హీరోయిన్గా పాత్రలు చేసిన శోభిత లుక్స్ ఏ రేంజ్ లో హాట్ గా ఉండేవో మనకి తెలుసు .


అయితే సడన్గా చీరలో మెరిసేసరికి జనాలు కూడా షాక్ అయిపోయారు . అంతేకాదు ఆమె కట్టుకున్న చీరకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం శోభిత ధూళిపాళ్ల పసుపు ఫంక్షన్ కి కట్టుకున్న చీర తన అత్తగారు లక్ష్మిదట. అంటే నాగచైతన్య తల్లి నాగార్జున మొదటి భార్య . నిజానికి సంప్రదాయ బద్దంగా అక్కినేని అమల - నాగార్జున ..శోభిత ధూళిపాళ్లకు ఇంటికి వెళ్లి చీర పెట్టారట .


కానీ ఆ చీర కాకుండా నాగచైతన్య ఎంతో ఇష్టంగా వాళ్ళ అమ్మకు కొనిచ్చిన చీరను లక్ష్మి తన కాబోయే కోడలికి ఇవ్వడంతో శోభిత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన లైఫ్ బాగుండాలి అని .. ఫస్ట్ పెళ్లిలో జరిగే ఫంక్షన్ పసుపు దంచే కార్యక్రమంలో ఆ చీరను కట్టుకుందట . అయితే నాగార్జున - అమల పెట్టిన చీరను కట్టుకోకపోవడంపై అక్కినేని ఫ్యాన్స్ మండి పడుతున్నారు . కాగా గతంలో సేమ్ టు సేమ్ సమంత కూడా ఇదే మాదిరిగా చేసింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .


నిజానికి అమలా - నాగార్జున ..సమంతకు పెళ్లి చీరను దాదాపు కోట్లు ఖర్చు చేసి డిజైన్ చేయించారట.  అయితే సమంత కాకుండా దగ్గుబాటి రామానాయుడు భార్య అనగా నాగచైతన్య అమ్మమ్మ చీరను రీ డిజైన్ చేయించి అదే చీర ను పెళ్లిలో కట్టుకుని అందరికీ షాక్ ఇచ్చింది ఈ బ్యూటి. ఒకప్పుడు సమంత ఇచ్చిన షాకే ఇప్పుడు కొత్త కోడలు శోభిత  ఇవ్వడంతో  అమల పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: