గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. చరణ్ ఈ సినిమాను ఏమంటూ మొదలెట్టాడో కానీ ఆది నుంచి అన్నీ కష్టాలే.. గేమ్ చేంజర్ కంటే చాలా ఆలస్యంగా మొదలైన దేవర సినిమా ఆల్రెడీ రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది.. కానీ చరణ్ మాత్రం గేమ్ ఛేంజర్ చుట్టూ తిరుగుతూనే వున్నాడు.. దర్శకుడు శంకర్ కి భారతీయుడు 2 రూపంలో అనుకోని కష్టాలు ఎదురయ్యాయి..ఆ సినిమా పూర్తి చేసే బాధ్యత మీద పడటంతో గేమ్ ఛేంజర్ ని హోల్డ్ లో పెట్టి మరీ ఆ సినిమాను పూర్తి చేసాడు.. ఆ సినిమా కోసం శంకర్ ఏకంగా 2 ఇయర్స్ సమయం తీసుకున్నాడు.. భారతీయుడు 2 మొదలు పెట్టేసరికి గేమ్ ఛేంజర్ సగం షూటింగ్ కంప్లీట్ అయింది.. ఈ రెండు సినిమాలను ఒకేసారి బ్యాలన్స్ చేస్తూ వచ్చాడు.. భారతీయుడు 2 సినిమా ఈ ఏడాది జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ భారీ డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో గేమ్ ఛేంజర్ సినిమాపై ఫ్యాన్స్ నమ్మకాలు కోల్పోయారు..
అయితే గేమ్ ఛేంజర్ కాంబో సెట్ చేసి భారీగా నిర్మాతగా మారి భారీగా ఖర్చు చేసిన దిల్ రాజు పరిస్థితి మాత్రం ముందు నుయ్యి వెనుక గొయ్యి లా మారింది..సినిమాలో కేవలం ఒక్క పాట కోసమే ఏకంగా 20 కోట్లకు పైగా ఖర్చు పెట్టించారట శంకర్. ఇదిలా ఉంటే మరోవైపు సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతూ ఉండడంతో నిర్మాతపై రోజు రోజుకు భారం పెరుగుతోంది. రీసెంట్ గా సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా ఈ మూవీ షూటింగ్ పూర్తి కాలేదని తెలుస్తోంది.అసలు విషయం ఏమిటంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇంకా 10 రోజులు మిగిలి ఉన్నప్పటికీ దాదాపు 6 గంటల ఫుటేజీ వచ్చినట్టుగా సమాచారం... ఇది నిజంగా నిర్మాతకు గుండె పగిలే విషయమే. అయితే ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు డైరెక్టర్ శంకర్ పై విరుచుకుపడుతున్నారు.