మళ్లీ ఆ స్ట్రాటజీని ఫాలో అవుతున్న షారుక్.. అందుకే ఇంత లేట్ అవుతోందా..?

MADDIBOINA AJAY KUMAR
బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో షారుక్ ఖాన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరో గా నటించి హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయి ఉన్న హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం షారుక్ ఖాన్ కి వరుసగా అపజయాలు రావడంతో ఈయన ఏకంగా కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నాడు. మళ్ళి చాలా గ్యాప్ తర్వాత అయినా
 పఠాన్ అనే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్నాడు. 

ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షనని కొల్లగొట్టింది. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత ఈ నటుడు జవాన్ అనే మరో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ సినిమాలో నయన తార , దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటించారు. ఇక షారుక్ ఖాన్ ఆఖరుగా డంకి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోకపోయిన మంచి విజయాన్ని మాత్రం అందుకుంది. 

ఇకపోతే పోయిన సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి మూడింటితో అద్భుతమైన విజయాలను అందుకున్న షారుక్ ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా స్టార్ట్ చేయలేదు. ఇక ఇన్ని విజయాలు ఉండి కూడా ఎందుకు షారుక్ నెక్స్ట్ మూవీ ని స్టార్ట్ చేయలేదు అని దానిపై అనేక వార్తలు వస్తున్నాయి. మళ్లీ షారుక్ కాస్త రెస్ట్ తీసుకోనైనా సరే అదిరిపోయే రేంజ్ విజయవంతమైన సినిమాల్లో నటించాలి అనే ఉద్దేశం తోనే కాస్త గ్యాప్ తీసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: