రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ విశిష్ట స్థానం సంపాదించుకున్నారు.. తన మ్యూజిక్ తో ఎన్నో హిట్స్ అందించడమే కాకుండా ప్రేక్షకుల చేత మాస్ స్టెప్స్ వేయించే విధంగా మాస్ ట్యూన్స్ అందించి దేవిశ్రీ ఎంతగానో ఆకట్టుకున్నాడు..ముఖ్యంగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలకు దేవిశ్రీప్రసాద్ అందించే మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుంది.. సుకుమార్ తన ప్రతి సినిమాలో దేవిశ్రీ చేత అదిరిపోయే స్పెషల్ సాంగ్ చేయిస్తూ వుంటారు..దేవిశ్రీ అందించే స్పెషల్ సాంగ్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతాయి.. ఇంకా చెప్పాలంటే సినిమా స్టోరీ ఎలా వున్నా కూడా దేవిశ్రీ అందించే మ్యూజిక్ తో హిట్ అయిన సినిమాలు చాలానే వున్నాయి.. దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ అందించి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు..
తాజాగా పుష్ప సినిమాకు దేవిశ్రీ అందించిన మ్యూజిక్ గ్లోబల్ వైడ్ గా ఊపు తీసుకొచ్చింది.. ఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ తో దేవిశ్రీ అందరి చేత మాస్ స్టెప్స్ వేయించాడు.. ఈ సినిమా లో అద్భుతమైన సాంగ్స్ కి గాను దేవిశ్రీ ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు. అయితే ప్రస్తుతం తెలుగులో దేవిశ్రీ చేతిలో స్టార్ సినిమాలు ఏమి లేవు..ఒకప్పుడు దేవితో సినిమాలు చేసిన దర్శకులు ఇప్పుడు మెల్లగా యూ టర్న్ తీసుకుంటున్నారు.. దేవిశ్రీప్రసాద్ తెలుగు లో పట్టు కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. మొదటగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న RC16 సినిమాలో ఏఆర్ రెహమాన్ ని తీసుకోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. అంతేకాకుండా, 'ఉప్పెన' వరకు దేవిశ్రీతో ఉన్న దర్శకులు, ఇప్పుడు ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారంటే, దేవిశ్రీ ప్రసాద్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే ప్రశ్న తలెత్తుతుంది..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల తెరకెక్కించిన ప్రతి సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ అందించే వారు.. కానీ ఆచార్య, దేవరకు మణిశర్మ, అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఇలా టాప్ సినిమాలన్నీ ప్రస్తుతం తమన్, అనిరుధ్ ఖాతాలో వున్నాయి.. దేవిశ్రీ కి సాలిడ్ హిట్ పడితే తప్ప మళ్ళీ దేవిశ్రీ ఊపు టాలీవుడ్ లో కనిపించాడు..