పవన్ , రవితేజ కాంబినేషన్లో మిస్సయిన సూపర్ హిట్ సినిమా ఇదే .. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Amruth kumar
మన సౌత్ చిత్ర పరిశ్రమలోనే లెజెండ్రీ డైరెక్టర్స్ లో మణిరత్నం కూడా ఒకరు..ఈయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ హీరో ఆశ పడుతూ ఉంటారు. కెరీర్ ప్లాప్స్ లో ఉన్నప్పుడు కూడా ఆయన ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు మళ్ళీ అదే విధంగా బౌన్స్ బ్యాక్ అవుతూ  ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ తో సూపర్ హిట్ అందుకుని మంచి కం బ్యాక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం కమలహాసన్ తో  ‘తగ్ లైఫ్’  సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఓ సినిమాను ప్లాన్ చేసేసాడు.

ఈ విషయాలన్నీ ఇలా ఉంచితే మణిరత్నం డైరెక్షన్లో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. అలా ఆయన డైరెక్షన్ లో వచ్చిన మల్టీస్టార‌ర్‌ సినిమాల్లో  యువ ఇటు సౌత్ లోను అటు నార్తులోను సూపర్ హిట్ గా నిలిచింది. ముందుగా ఈ సినిమాని కోలీవుడ్లో సూర్య - మాధవన్ కాంబినేషన్లో తెరకెక్కించగా హిందీలో అజయ్ దేవగన్ - అభిషేక్ బచ్చన్ కాంబినేషన్లో తెరకెక్కించాడు. ఇక అలాగే తెలుగులో కూడా ఈ సినిమాను పవన్ కళ్యాణ్ - రవితేజ కాంబినేషన్లో తీసుకురావాలని మణిరత్నం ప్లాన్ చేశాడు. కానీ చివరి నిమిషం వరకు ఈ కాంబినేషన్ సెట్ కాలేదు.

తమిళ్లో సూర్య చేసిన పాత్రని పవన్ కళ్యాణ్ తో మాధవన్ చేసిన పాత్రని రవితేజతో చేయించాలని ఆయన అనుకున్నాడు ఇద్దరు హీరోలకు కథ వినిపించాడు. ఇద్దరికీ నచ్చింది షూటింగ్ వెళ్లే ముందు ఎందుకు ఈ సినిమా తెలుగు హీరోలతో చేస్తే వర్కౌట్ అవధాని పవన్ కళ్యాణ్ అన్నారట. మీకు కథ పూర్తిగా నచ్చకపోతే సినిమా చేయొద్దు వేరే కథతో సినిమా చేద్దామని మన రత్నం కూడా అన్నారట. అలా షూటింగ్ కు వెళ్లే ముందు ఈ సినిమా ఆగిపోయింది . అయితే తమిళంలో విడుదలై సూపర్ హిట్ అవ్వగానే తెలుగులో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సూర్య కూడా తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.. ఇలా తెలుగులో రవితేజ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రావాల్సిన సినిమా ఇలా మధ్యలోనే ఆగిపోయింది. చిరంజీవి - రవితేజ కలిసి వాల్తేరు వీర‌య్య‌ సినిమాలో కలిసి నటించారు.. మరి పవన్ - రవితేజ రాబోయే రోజుల్లో అయినా కలిసిన నటింస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: