సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం కథానాయకుడు అనే సినిమా రూపొందున విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో రజనీ కాంత్ కు స్నేహితుడు పాత్రలో జగపతి బాబు నటించాడు. ఈ మూవీ లోని జగపతి బాబు పాత్ర కోసం మొదట ఈ మూవీ దర్శకుడు అయినటువంటి కే ఎస్ రవి కుమార్ , జగపతి బాబు ను కాకుండా బాలకృష్ణ ను తీసుకోవాలి అనుకున్నాడట. అందులో భాగంగా బాలకృష్ణ ను వెళ్లి సంప్రదించాడట. ఈ మూవీ కథను మొత్తం వివరించి తన పాత్రకు సంబంధించిన అనేక విషయాలను కూడా చెప్పాడట.
ఇక కథ మొత్తం విన్న తర్వాత రజనీ కాంత్ హీరో గా రూపొందబోయే సినిమాలో అతనికి స్నేహితుడి పాత్రలో నటించడానికి బాలకృష్ణ ఒప్పుకున్నాడట. ఇక ఇదే విషయాన్ని రవి కుమార్ , రజనీ కాంత్ కు వెళ్లి చెప్పాడట. ఆ తర్వాత ఆయన బాలకృష్ణ కు ఫోన్ చేసి నువ్వు నేను హీరోగా రూపొందబోయే సినిమాలో నా స్నేహితుడి పాత్రలో నటించడానికి ఒప్పుకున్నావంట కదా అని అడిగాడట. దానితో బాలకృష్ణ ఆవును అని చెప్పాడట.
ఇక దానితో రజనీ కాంత్ , బాలకృష్ణ తో నువ్వు ఆ సినిమా చేయకపోవడం మంచిది. ఎందుకు అంటే నీ స్థాయి నీ ఇమేజ్ చాలా పెద్దది. నువ్వు ఆ సినిమాలో నటించినట్లు అయితే ఆ సినిమాలో నీ పాత్రకు సంబంధించిన సన్నివేశాలలో అనేక మార్పులు , చేర్పులు చేయవలసి వస్తుంది. అయినా కూడా నీ ఈమేజ్ కి ఆ పాత్ర చేరుతుందో లేదో తెలియదు దాని వల్ల సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాడట. దానితో బాలయ్య కూడా తాను ఆ సినిమాలో నటించకపోవడం మంచిది అనే నిర్ణయానికి వచ్చి ఆ సినిమాలో నటించలేదట.