చీరకట్టులో ఆకట్టుకుంటున్న కావ్య.. అల్ట్రా స్టైలిష్ డ్రెస్ లోనే కాదు ఇందులో కూడా ఈమెను ఆపలేం..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మలలో కావ్య దాపర్ ఒకరు. ఈమెకు సరైన విజయాలు లేకపోయినా అవకాశాలు మాత్రం అదిరిపోయే స్థాయిలో వస్తున్నాయి. ఈమె ఇప్పటికే ఈ సంవత్సరం అనేక సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈమె ఈ సంవత్సరం మొదటగా సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఊరు పేరు భైరవకోన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ రవితేజ హీరో గా రూపొందిన ఈగల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ రామ్ పోతినేని హీరోగా రూపొందిన డబల్ ఈస్మార్ట్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల నడుమ ధియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
 

ఇకపోతే కొంత కాలం ఈ బ్యూటీ గోపీచంద్ హీరోగా రూపొందిన విశ్వం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో ఎక్కువ శాతం హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తున్న ఈ నటి అప్పుడప్పుడు క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ నటి శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కావ్య కి సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: