యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో.కే మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ భారీ స్థాయి కలెక్షన్లను వసూలు చేయడం కష్టమే అని కొంత మంది భావించారు. కానీ ఈ సినిమా మాత్రం అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది.
ఈ సినిమా ఓ రెండు ప్రాంతాల్లో మినహాయించి అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలాని కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో ఆరు కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , కేరళ ఏరియా లో ఒక కోటి ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది . ఇప్పటివరకు ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో 4.13 కోట్ల కనెక్షన్లు రాగా , కేరళ ఏరియాలో 97 లక్షల కలెక్షన్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక దాదాపుగా ఈ ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన రన్ ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. మరి ఈ మూవీ రెండు ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోవడం కాస్త కష్టంగానే ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుందో లేదో చూడాలి.