వార్నీ..రాజమౌళికి ఈ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? భార్య చెప్పిన కూడా వినకుండా ఆ పని చేసేశాడే..!

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రాజమౌళి పేరు ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నం. మరి ముఖ్యంగా ఎప్పుడైతే రాజమౌళి-మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు అని తెలిసిందో . అప్పటినుంచి ఆయనపై ఇష్టమున్న జనాల కన్నా కూడా మరి కొంతమంది ఎక్కువగానే జనాలు ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న జక్కన్న గురించి ఎంత చెప్పకున్నా అది తక్కువగానే ఉంటుంది . ఓటమి అనే పదాన్ని తన దరిదాపుల్లోకి కూడా రానీకుండా మెయింటైన్ చేస్తున్నాడు రాజమౌళి . అలాంటి రాజమౌళికి ఒక హీరోయిన్ అంటే మహా మహా ఇష్టమట .


ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ  ఇంటర్వ్యూలో బయటపెట్టాడు , ఆశ్చర్యం ఏంటంటే తనకు ఎంతో ఇష్టమైన రమా రాజమౌళి చెప్పినా కూడా ఆ హీరోయిన్ తో సినిమాను తెరకెక్కించాడు , ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా..? ఆమె  మరి ఎవరో కాదు "సలోని" ఇండస్ట్రిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా కష్టపడిన సలోని అంటే రాజమౌళికి చాలా చాలా ఇష్టమట . మరీ ముఖ్యంగా ఆమె ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తుంది అంటూ మగధీర సినిమా ప్రమోషన్స్ లో కూడా చెప్పారు .


మగధీరలో ఒక చిన్న క్యారెక్టర్ లో మెరుస్తుంది . ఆ తర్వాత మర్యాద రామన్న సినిమాతో ఆమెను ఏకంగా హీరోయిన్గా పెట్టి సూపర్ డూపర్ హిట్ అందించేసాడు. సలోని ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తుంది అని రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు . అంతేకాదు ఆమె తన ఫేవరేట్ హీరోయిన్ అని కూడా చెప్పుకొచ్చాడు . అయితే రాజమౌళి  వైఫ్ రమా రాజమౌళి మర్యాద రామన్న సినిమా తెరకెక్కిస్తున్న మూమెంట్లో సలోని హీరోయిన్గా అవసరమా అంటూ కూడా ఆయనకు ఆమెను తీసేయ్ అనే విధంగా చెప్పిందట . కానీ రాజమౌళి అస్సలు వినలేదట . ఫైనల్లీ రాజమౌళి నిర్ణయమే కరెక్ట్ అయింది.  సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: