పవన్ ఓజి నుండి గూస్ బంప్స్ అప్డేట్.. దాని గురించేనా..!?

Anilkumar
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల సంగతి మాత్రం అంతగా తెలియడం లేదు. ఆయనకు అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతల ఎదురుచూపులకు ఫలితం ఎప్పుడు దక్కుతుందో తెలియడం లేదు. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ అటకెక్కిందనే వార్తలు వస్తుంటాయి. హరి హర వీరమల్లు ఎప్పుడు ఉంటుందో తెలియడం లేదు. ఇక సుజీత్ ఓజీ మూవీ గురించి మాత్రం అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో గుర్తు చేస్తుంటాడు. ఫ్యాన్స్ సైతం ఓజీ మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టుగా కనిపిస్తోంది.

 ఎన్నికలకు ముందు ఓజీ సినిమాను చకచకా షూటింగ్ చేశాడు సుజీత్. ముంబై, పుణె అంటూ షెడ్యూల్స్ ఫాస్ట్‌గా ఫినిష్ చేశాడు. ఇక కొత్త షెడ్యూల్ కోసం లొకేషన్ల వేటలో పడ్డ టైంలోనే ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలను దూరం పెట్టేశాడు.  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ గ్యాప్‌ తర్వాత ఇప్పుడు స్పీడ్‌ పెంచాడు. తాను కమిట్‌ అయిన సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసే పనిలో బిజీ అయ్యారు. అటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఇటు సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ మధ్య హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు పవన్. ఈ మూవీ చిత్రీకరణ

 జరుగుతుంది. పవన్‌ కి టైమ్‌ దొరికినప్పుడల్లా ఆయనపై ఉన్న కీలక సన్నివేశాలను షూట్‌ చేస్తున్నారు. ఏమాత్రం ఆలస్యం లేకుండా పవన్‌ పాత్రని కంప్లీట్‌ చేసే పనిలో ఉన్నారు టీమ్‌. ఈ నేపథ్యంలో సోమవారం నుంచే కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైంది. నవంబర్‌ 10 నాటికి చిత్రీకరణ పూర్తి చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే మొదటి సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు. ప్వార్డ్ వర్సెస్‌ స్పిరిట్‌ పేరుతో ఈ పాట రానుంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మార్చి 28న హరిహర వీరమల్లు పార్ట్ 1ని విడుదల చేయబోతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: