"ఆ నొప్పి భరిస్తేనే హీరోయిన్ అవుతాం"..రష్మిక మందన్న సెన్సేషనల్ కామెంట్స్..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది నిజంగానే ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అవుతారు . కొంతమంది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సరే సక్సెస్ అవ్వలేక వెనకడుగు వేస్తూ ఉంటారు.  అయితే ఇండస్ట్రీ లోకి వచ్చి అతి  తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ గా మారిన వాళ్ళు చాలా చాలా తక్కువ . వాళ్లల్లో ఒక్కరే ఈ రష్మిక మందన్నా.


సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని సూపర్ స్టార్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది . ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్  సినిమాల్లో నటిస్తూ ఒక్కొక్క సినిమాకి 6 , 7 కోట్లు పారితోషకం పుచ్చుకుంటూ వస్తుంది . అలాంటి రష్మిక మందన్నా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే ఆ నొప్పి భరించాల్సిందే అంటూ పెట్టిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది . రష్మిక మందన్నా అభిమానులతో బాగా చిట్ చాట్ చేస్తూ వస్తూ ఉంటుంది . ఆ విషయం అందరికీ తెలిసిందే .


ఆ సమయంలోనే పుష్ప సినిమా గురించి సంచలన విషయాన్ని బయటపెట్టింది.  పుష్ప సినిమాలో రష్మిక మందన్నా డిగ్లామరస్ లుక్ లో కనిపిస్తుంది . అయితే అలాంటి మేకప్ చేయడానికి చాలా చాలా కష్టపడ్డారట పుష్పటీం.  మరీ ముఖ్యంగా పుష్ప సినిమా షూటింగ్ టైంలో రష్మిక మందన్నా సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోలేక పోయిందట.  బాడీ అంతా అలా బ్లాక్ కలర్ మేకప్ చేయడంతో లంచ్ బ్రేక్ లో లిప్స్ వరకే అలా క్లీన్ చేసుకుని జూస్ మాత్రమే తీసుకునిందట.  ఆ మేకప్ రిమూవ్ చేసేటప్పుడు చాలా చాలా నొప్పి వేసేదట . ఆ టైంలో రష్మిక మందన్నా ఆ ఫోటోలను షేర్ చేస్తూ .."ఇలాంటి నొప్పులు భరిస్తేనే ఇండస్ట్రీలో హీరోయిన్ కాగలరు" అంటూ చెప్పుకొచ్చింది. ఆమె పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.  రష్మిక చెప్పింది నిజమే.. హీరోయిన్ అవ్వడం మామూలు విషయం కాదు . చాలా నొప్పులు భరించాలి అంటున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: