తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువా’..ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ గా తెరకెక్కించారు. కంగువా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ఈ సినిమా కోసం తమిళ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ అలాగే టాలీవుడ్ అభిమానులు, ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.. ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన బాబీ డియోల్ ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నాడు.. ఈ సినిమాలో సూర్య ఇదివరకు ఎప్పుడు చేయని విభిన్న పాత్రలో నటిస్తున్నాడు.. ఆ పాత్రలో సూర్య అద్భుతంగా నటించాడు.. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది.. ట్రైలర్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది..ఈ సినిమాకు దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు..
ఇదిలా ఉంటే ఈ సినిమా అక్టోబర్ 10 నే విడుదల కావాల్సి వుంది.. కానీ రజనీ సినిమా కోసం సూర్య తన సినిమా రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు.. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల అయ్యి వందల కోట్ల వసూళ్లు వస్తాయనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు... సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ వర్కవుట్ అయితే వెయ్యి కోట్ల మార్కును కూడా అందుకోవచ్చు.కానీ నిర్మాత జ్ఞానవేల్ రాజా మాత్రం ఈ సినిమా ఏకంగా రూ.2 వేల కోట్ల వసూళ్లు రాబడుతుందని తెలిపారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగువ వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందా అని అడిగగా.. వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు వస్తాయని ఆయన అన్నాడు . కానీ ఈ కామెంట్ నెటిజన్లకు అస్సలు నచ్చడం లేదు. కాన్ఫీడెన్స్ ఉండాలి మరీ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్లా అనిపిస్తోంది. సూర్య సౌత్ ఇండియాలో మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరోనే.కానీ రెండు వేల కోట్లు అంటే మరీ ఓవర్గా వుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..