తలైవా 'కూలీ' లో ఊహించని సర్ప్రైజ్ లు.. ఇంకెంతమందిని దింపుతావ్ లోకేష్ అన్నా..!!

murali krishna
తమిళ్ స్టార్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు... కథలు కొత్తగా లేకపోయినా కూడా స్క్రీన్ ప్లే, హీరోయిజం ఎలివేషన్లతో మ్యాజిక్ చేస్తారు.. అదే స్టైల్ లో  ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసాడు.యూత్ కి నచ్చేలా సినిమాలు తీయడంలో లోకేష్ బాగా సక్సెస్ అయ్యారు.లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన లియో సినిమా కి ఊహించని ఓపెనింగ్స్ వచ్చాయి.. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తలైవా రజనీకాంత్ తో  “కూలి” అనే సినిమా చేస్తున్నాడు.. బిగ్గెస్ట్ మాఫియా డ్రామా గా ఈ సినిమా తెరకెక్కుతుంది.నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన బంగారం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందని సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమా లో టాలీవుడ్ కింగ్ నాగార్జున అలాగే స్టార్ హీరో ఉపేంద్ర స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు... అయితే వారి పాత్ర ఎంత నిడివి అనేది మాత్రం బయటికి రాలేదు. 

విక్రమ్ లో రోలెక్స్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపించాడో అంతకన్నా ఎక్కువగానే వారి పాత్రలని డిజైన్ చేసినట్టు సమాచారం. 
ఇప్పుడు వీళ్ళు చాలదు అన్నట్టు బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ ని సైతం లోకేష్ తీసుకొస్తున్నాడట. అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు ఖాయమైనట్టని సమాచారం.ఇదే కనుక నిజమైతే కూలి హిందీ మార్కెట్ కు తిరుగుండదని తెలుస్తుంది. అయితే రజని సోలో హీరో గా చేసిన సినిమాలను నార్త్ ఆడియన్స్ అంతగా పట్టించుకోవడం లేదు. దీనితో అమిర్ ఖాన్ కామియో తో సినిమాపై మరింత హైప్ తెచ్చేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం..ఇదిలా ఉంటే కూలీ సినిమా తరువాత సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా ఢిల్లీ, రోలెక్స్, విక్రమ్ పాత్రలను కలుపుతూ ఒక మల్టీస్టారర్ తీస్తానని ఎవరూ కూడా ఊహించని రేంజ్ లో ఉంటుందని లోకేష్ తెలిపారు.ఖైదీ 2 కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్తుందని లోకేష్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: