స్విమ్ సుట్ లో రెచ్చిపోయిన ఖిలాడి బ్యూటీ.. అలాంటి స్టిల్స్ తో కుర్రకారు గుండెకు గాలం..?

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ డింపుల్ హయాతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందిన గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్లో నటించింది . ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , అలాగే ఇందులోని ఐటమ్ సాంగ్లో ఈమె తన డాన్స్ తో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈమెకు తెలుగు లో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడీ సినిమాలో హీరోయిన్గా నటించింది.
 

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఇందులో ఈ బ్యూటీ తన అందాల ఆరబోతతో కుర్రకారుకి ఫుల్ కిక్ ను ఎక్కించింది. ఈ మూవీ తర్వాత ఈ నటి గోపీచంద్ హీరోగా రూపొందిన రామబాణం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈమె హీరోయిన్గా నటించిన సినిమాలు ఏవి పెద్ద స్థాయిలో విజయాలు అందుకోకపోయిన ఈమె నటించిన చాలా సినిమాల్లో హాట్ అందాలను ఆరబోయడంతో ఈమెకు మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది.

సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్విమ్ సూట్ ను వేసుకుని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: