మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్?
ఇదిలా ఉండగా త్వరలోనే నీలికళ్ల సుందరి, ప్రపంచంలోనే అత్యంత అందమైన భామ ఐశ్వర్య రాయ్ తో కలిసి బాలకృష్ణ నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే టాలీవుడ్ రికార్డులు బద్దలవుతాయి. ఇటీవల ఒక అవార్డు ఫంక్షన్ లో బాలకృష్ణ కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంది ఐశ్వర్య. బాలయ్య బాబుతో సినిమా చేయడానికి సంతోషంగా ఒప్పుకుంటుందని కొంతమంది పేర్కొంటున్నారు. మరోవైపు బాలయ్య ఓ సినిమాలో సూపర్ హీరోగా కూడా కనిపించనున్నారని రూమర్స్ వస్తున్నాయి ఆ సినిమా మరేదో కాదు ఆయన కొడుకు మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్న మూవీనే.
ఫ్యాన్స్ మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడా అని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6న ఆయన పుట్టిన రోజున ఆయన తొలి సినిమా పోస్టర్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు "హనుమన్" దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్షజ్ఞ ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని ఆశ పడుతున్నాడు. బాలకృష్ణ కూతురు తేజస్విని తన తమ్ముడు మోక్షజ్ఞ నటిస్తున్న సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రూ. 100 కోట్ల బడ్జెట్ కేటాయించారు. తేజస్వినికి ఇది తొలి నిర్మాణం. బాలయ్య తన కొడుకు సినిమా పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కాలని నిర్మాతలకు చెప్పారు. సినిమాకు ఎలాంటి బడ్జెట్ కట్స్ ఉండకూడదని స్పష్టం చేశారు. సినిమా నిర్మాణంలో ప్రతి విషయాన్ని ఆయనే నేరుగా పర్యవేక్షిస్తున్నారు. మోక్షజ్ఞకు జంటగా జాన్వీ కపూర్ చెల్లెలు కుషి కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్‌గా రవీణ తండన్ కూతురు రాషా లేదా అనిల్ తాడానీ కూతురును కూడా పరిశీలిస్తున్నారట. మోక్షజ్ఞకు జంటగా రాషా నటించే అవకాశం ఎక్కువగా ఉందిని తెలుస్తోంది. మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. అంతేకాకుండా, బాలకృష్ణ తన కొడుకు తొలి సినిమాను బాలీవుడ్‌లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.