దివంగత సీనియర్ నటుడు ఏఎన్నార్ అంటే ఎంత రొమాంటిక్ హీరోనో చెప్పనక్కర్లేదు. ఇప్పుడైతే అందరు నాగర్జునని మన్మధుడు అంటారు.కానీ అప్పట్లో ఏఎన్ఆర్ ని చాలామంది హీరోయిన్లు ఇష్టపడేవారు. ఇప్పుడు నాగార్జునకి ఎలా అయితే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అప్పట్లో నాగేశ్వరరావుకి కూడా అమ్మాయిల ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా ఈయన తో నటించే ప్రతి ఒక్క హీరోయిన్ తో ఈయన చాలా చనువుగా ఉండేవారు.ఇక ఏఎన్ఆర్ హీరోయిన్స్ తో చనువుగా ఉండటంతో చాలా మంది హీరోయిన్లతో ఏఎన్ఆర్ కి ఎఫైర్ వార్తలు వినిపించాయి. కానీ ఏది కూడా నిజం కాదు.ఆయన చేసుకున్న భార్యని తప్ప మరో మహిళను తప్పుడు ఉద్దేశంతో చూడలేదు. అయితే అలాంటి నాగేశ్వరరావు ఓ యంగ్ హీరోయిన్ పై మనసు పడి అలాంటి కామెంట్లు చేశారు. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే మిల్కీ బ్యూటీ తమన్నా..
ఇక విషయంలోకి వెళ్తే.. స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాల పాటు సౌత్ నార్త్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ నాగచైతన్యతో కలిసి తడాఖా మూవీలో హీరోయిన్ గా నటించింది అయితే ఈ సినిమా కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అక్కినేని నాగేశ్వరరావు తమన్నా పై చేసిన కామెంట్లు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. నీ వయసెంతమ్మ అని ఏఎన్ఆర్ అడగగా అప్పట్లో తమన్నా వయసు 23 ఉండడంతో 23 ఏళ్లు అని చెప్పింది. దాంతో నిన్ను చూడగానే నాకు 25 ఏళ్లు ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
అయితే 23 ఏళ్లు కాబట్టి వయసు దాచుకోకుండా చెబుతున్నావ్.. కానీ 32 ఏళ్ల వయసు అయితే చెప్పేదానివి కాదు అంటూ ఫన్నీ కామెంట్ చేశారు ఏఎన్ఆర్.అంతే కాదు నీలాంటి యంగ్ హీరోయిన్ ని చూస్తే కనీసం విగ్గు పెట్టుకొని అయినా నీతో డాన్స్ చేస్తే బాగుండు కదా అని అనిపిస్తుంది.. నా ఏజ్ నిన్ను చూస్తే తక్కువయిపోయినట్టు అనిపిస్తుంది అంటూ రొమాంటిక్ కామెంట్స్ చేశారు ఏఎన్ఆర్.ఇక ఏఎన్ఆర్ మాటలకు అక్కడున్న వాళ్ళందరూ నవ్వుకున్నారు