బిగ్ బాస్ లోకి రెండోసారి వచ్చిన గంగవ్వ.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా?

praveen
ప్రతి ఏడాది సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించే బిగ్ బాస్ కార్యక్రమం.. ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కూడా ఇలాగే ఎంటర్టైన్ చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగానే బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఇష్టపడే ప్రేక్షకులు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఎప్పటిలాగానే టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే మొన్నటి వరకు ఎవరికీ తెలియని కంటెస్టెంట్స్ ఉన్నారు అనే ఒక టాక్ బయట వినిపించిన.. ఇక ఇప్పుడు బాగా ఫేమస్ అయిన బిగ్ బాస్ మాజీ సెలబ్రిటీలనే వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోపలికి పంపించారు నిర్వాహకులు.

 ఇటీవలే వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన హరితేజ,రోహిణి, నాయని పావని, గంగవ్వ, గౌతం కృష్ణ, ముక్కు అవినాష్, మహబూబ్, టెస్టి తేజ గత సీజన్లో తమదైన శైలిలో  అలరించిన వారే కావడం గమనార్హం. అయితే ఈ కార్యక్రమంలోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ గతంతో పోల్చి చూస్తే అదిరిపోయే గేమ్ ఆడుతుంది. తన వాక్చాతుర్యంతో కూడా అదరగొడుతుంది. అయితే సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న గంగవ్వ అనారోగ్యానికి గురి కావడంతో ఆమె కోరిక మేరకు బిగ్ బాస్ ఆమెను హౌస్ నుంచి బయటకు పంపించాడు.

 ఇక ఇప్పుడు ఎనిమిదవ సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన గంగవ్వ.. అందరినీ సర్ప్రైజ్ చేసింది అని చెప్పాలి. ఒకప్పటిలా అమాయకంగా మాత్రం గంగవ్వ కనిపించట్లేదు. తనదైన శైలిలో సత్తా ఏంటో చూపిస్తుంది. అయితే ఆరు పదుల వయసులో కూడా యంగ్ కంటెంట్ లోకి పెద్ద ఎత్తున పోటీ ఇస్తుంది. కాగా ఇక గతంలో వారానికి లక్ష రూపాయలు మాత్రమే తీసుకున్న గంగవ్వ ఇప్పుడు రెండోసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం భారీగానే పుచ్చుకుంటుందట. ఏకంగా వారానికి 3.5 లక్షలు తీసుకుంటుందట గంగవ్వ. ఆమెకు బయట పాపులారిటీ ఎక్కువగానే ఉండడం.. సినిమాలు కూడా చేస్తూ ఉండడంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఇంత పెద్ద మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: