ఆ హీరోయిన్ భుజంపై చేయివేయడానికే భయపడిపోయిన ANR ?
కేవలం హీరోగానే కాకుండా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు .అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇదిలా ఉండగా.... అక్కినేని నాగేశ్వరరావు గారికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కినేని నాగేశ్వరరావు ఓ హీరోయిన్ భుజంపై చేయి వేయడానికి భయపడిపోయేవారట. వివరాల్లోకి వెళ్తే.... ఏఎన్ఆర్ సినిమాల్లోకి రాకముందు చాలామంది నటులు సినిమాలు చేస్తుండేవారు.
భానుమతి కూడా ఏఎన్నార్ కంటే పెద్దది. ఏజ్ లోనే కాకుండా, నటన పరంగాను చాలా పెద్దది. ఆమె అంటే ప్రతి ఒక్కరికి భయం ఉండేది. ఎన్టీఆర్ వంటి ఎందరో హీరోలు సైతం ఆమె వద్ద చాలా జాగ్రత్తగా ఉండేవారట. ప్రతి ఒక్కరి వద్ద చాలా ఎక్కువ డామినేషన్ చూపించేదట. అయితే ఏఎన్ఆర్ సినిమాల్లో వచ్చిన సమయంలో ఆమెతో పని చేయాలంటే భయపడేవాడట. ఓ సినిమాలో నటించే సమయంలో ఏఎన్నార్ టెన్షన్ పడినట్లు తెలియజేశారు. పాట షూటింగ్ సమయంలో ఆమె భుజంపై చేయి వేసే సీన్ ఉందట. ఆ సమయంలో ఏఎన్నార్ వనికి పోయేవాడట.
సరిగ్గా చేయి వేయి అని ఆమెనే గట్టిగా అరిచిందట. తన చీర కొంగు, బ్లౌజ్ మెరుపులు మెరిసేలా ఉందని అది గుచ్చుకునేలా ఉందట. ఓవైపు ఆమెతో యాక్టింగ్ చేయాలంటే భయం, మరోవైపు భానుమతి చీర కంఫర్ట్ గా లేకపోవడంతో ఏఎన్ఆర్ చాలా ఇబ్బంది పడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా ఏఎన్నార్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఈ విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.