ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ షాట్.. బాహుబలిలో కాదు.. రాజమౌళికి నచ్చిన సీన్ ఏదంటే?
కెరియర్ లో ఇప్పుడు వరకు ఓటమి ఎరుగని జక్కన్న సినిమాల విషయంలో ఎంత ఖచ్చితత్వంతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఏ షాట్ ని ఎలా తెరకెక్కించాలి అనే విషయంపై కూడా ఫుల్ క్లారిటీతో ఉంటారు. అలాంటి రాజమౌళికి ఒక స్పెషల్ సీన్ ఉంది అంటే దాని గురించి తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు. అయితే ఇక ప్రభాస్ కెరియర్ లో ఒక సన్నివేశం ఇలా రాజమౌళికి బెస్ట్ సీన్ అట. రాజమౌళి బెస్ట్ సీన్ అనగానే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి పార్ట్ వన్, పార్ట్ 2 లో ఏదో ఒకటి అయి ఉంటుంది అని అనుకుంటారు అందరు.
కానీ కాదు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మొదటి మూవీ ఛత్రపతి సినిమాలోనీ ఒక ఎపిసోడ్ ప్రభాస్ కెరియర్ లో రాజమౌళికి నచ్చిన బెస్ట్ సీనట. ఒకే షాట్లో రెండు మూడు ఎమోషన్స్ ని మిక్స్ చేస్తే ఆ షాట్ చేయడం సులువు కాదని.. చక్కని చెప్పుకొచ్చాడు. చత్రపతి సినిమాలో హీరో ఉండే కాలనీలో చిన్నపిల్లాడు కల్లులేని తల్లికి భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఆ సమయంలో హీరోకి వాళ్ళ తల్లి గుర్తుకొస్తుంది ఒకవైపు తల్లిని తలుచుకుని ఆనందం మరోవైపు ఆ పిల్లాడిని అదృష్టం తనకు లేదని బాధ.. ఆ షాట్లో ప్రభాస్ అద్భుతంగా నటించాడని ఆ షాట్ ప్రభాస్ కెరియర్ లోనే బెస్ట్ షాట్ అంటూ జక్కన్న పేర్కొన్నాడు.