ముగ్గురు మొనగాళ్లు సినిమాలో.. మెగాస్టార్ కి డూప్ గా నటించిన మరో ఇద్దరు ఎవరో తెలుసా?

praveen
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చిన మెగాస్టార్ ఇక ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా కొనసాగుతూ ఉన్నారు. ఇక సినిమాలనే ప్రపంచంగా మార్చుకునే ఎంతో మంది యువకులకు ఆయన ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే 150కి పైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఇండస్ట్రీ హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు ప్రేక్షకులు అందరికీ  ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు కెరియర్ లో ఎన్నో సినిమాల్లో ద్వీపాంత్రాభినయం చేశాడు. ఇక తన నటనతో ప్రేక్షకులను మెప్పించ గలిగాడు. అయితే ఇక మెగాస్టార్ ఇలా తన కెరియర్లో త్రిపాత్రాభినయం చేసిన సినిమా కూడా ఒకటి ఉంది. అదే ముగ్గురు మొనగాళ్లు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో మూడు విభిన్నమైన పాత్రలు పోషించారు మెగాస్టార్ చిరంజీవి.

 రౌడీగా పోలీస్ ఆఫీసర్గా డాన్స్ మాస్టర్ గా ఆయన ప్రేక్షకులను అలరించారు. ఇక ఈ మూవీని ఆయన సోదరుడు నాగబాబు నిర్మించడం గమనార్హం. రాఘవేంద్రరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఈ మూవీ సూపర్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పట్లో సినిమాల్లో ఒక హీరోను ఒకేసారి రెండు పాత్రల్లో చూపించేందుకు గ్రాఫిక్స్ ని వాడుతున్నారు. కానీ అప్పట్లో ఇలాంటివేవి అందుబాటులో లేవు. దీంతో హీరోలు డబుల్ లేదా ట్రిపుల్ రోల్ చేయాల్సి వస్తే డూప్ లను  వాడేవారు. ఈ క్రమంలోనే చిరంజీవి హీరోగా నటించిన ముగ్గురు మొనగాళ్లు సినిమాల్లో కూడా ఇద్దరు డూప్ల అవసరం ఏర్పడిందట. ఈ సినిమాలో చిరంజీవి డూపులుగా ఇక మెగాస్టార్ వద్ద పనిచేస్తున్న పీఏ సుబ్బారావు, చిరు స్నేహితుడు నటుడు ప్రసాద్ రావులు నటించారట. వీరు ఎత్తు బరువు విషయంలో చిరంజీవికి సరిగ్గా సరిపోతారు కనుక వీరిద్దరిని డూపులుగా పెట్టారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: