బాలయ్య.. రజిని కాంబోలో మిస్ అయిన మూవీ ఏదో తెలుసా.. అంతా సెట్ అయ్యాక చివరలో ట్విస్ట్..?

frame బాలయ్య.. రజిని కాంబోలో మిస్ అయిన మూవీ ఏదో తెలుసా.. అంతా సెట్ అయ్యాక చివరలో ట్విస్ట్..?

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ , సూపర్ స్టార్ రజనీ కాంత్ కాంబో లో తమిళ దర్శకుడు కె ఎస్ రవి కుమార్ ఓ సినిమా చేయాలి అనుకున్నాడట.  ఆల్మోస్ట్ అంత సెట్ అయ్యాక ఈ కాంబో మూవీ మిస్ అయిందట. ఎందుకు మిస్ అయింది అనే వివరాలను తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా కె ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో కథానాయకుడు అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా తెలుగు వర్షన్ లో రజనీ కాంత్ కు స్నేహితుడు పాత్రలో జగపతి బాబు నటించాడు.

కే ఎస్ రవి కుమార్ మొదట ఈ సినిమా తెలుగు వర్షన్ లో రజనీ కాంత్ కు స్నేహితుడి పాత్రలో జగపతి బాబు ను కాకుండా బాలకృష్ణ ను అనుకున్నాడట. అందులో భాగంగా బాలకృష్ణ కు కథను చెప్పాడట. బాలకృష్ణ కూడా కథానాయకుడు సినిమాలో రజనీ కాంత్ కు స్నేహితుడు పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇలా అంతా ఓకే అయిన తర్వాత రజనీ కాంత్ ఓ రోజు బాలకృష్ణ కు ఫోన్ చేసి కథానాయకుడు సినిమాలో నా స్నేహితుడు పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు అంట కదా అని అడిగాడట. దానితో బాలకృష్ణ కూడా అవును అని చెప్పాడట.

ఇక ఆ తర్వాత రజనీ కాంత్ ఆ సినిమా నువ్వు చేయకు. ఎందుకు అంటే నీ క్రేజ్ చాలా పెద్దది. నీ ఈమేజ్ ను చేయడం కోసం కథలో అనేక మార్పులు , చేర్పులు చేయవలసి ఉంటుంది. అలా చేయడం వల్ల ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉండదు. అందుకే ఆ సినిమా నువ్వు చేయకపోవడం చాలా బెటర్ అని చెప్పాడట. దానితో బాలకృష్ణ కూడా నిజమే అనే ఆలోచనకు వచ్చి ఆ సినిమా చేయలేదట. ఇలా బాలకృష్ణ , రజనీ కాంత్ కాంబో లో మూవీ మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: