దళపతి విజయ్ చెల్లెలు.. ఏం చదువుకుందో తెలుసా.. ఆమె ఎవరంటే..!?

Amruth kumar
కోలీవుడ్  హీరో దళపతి విజయ్ రాజకీయాల్లో ఎంటర్ అవుతున్న సమయంలో ఆయన చివర సినిమాగా బాలయ్య నటించిన భగవంత్‌ కేసరికి రీమేక్ ఆ హెచ్ వి వినోద్ దళపతి 69వ‌ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇందులో విజయ్‌కు జంటగా పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా. అలాగే మరో కీలకమైన పాత్రలో మమిత బైజు కూడా ఈ సినిమాలో మంచి ఛాన్స్ అందుకుని ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.. అంతకంటే ముందే ప్రేమలు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. కానీ ఈ బ్యూటీ గురించి చాలామందికి పెద్దగా పరిచయం లేద‌నే చెప్పాలి. అలాంటిది ద‌ళ‌పతి విజయ్ లాస్ట్ సినిమాలో అవకాశం కొట్టేసింది అనగానే అసలు ఈ బ్యూటీ ఎవరు.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలను ఆరా తీయటం మొదలుపెట్టారు.అలాంటి మమిత బైజు ఎంతవరకు చదువుకుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.


మలయాళ చిత్ర పరిశ్రమలో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కేరళ బ్యూటీ మమిత బైజు... 2017లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.. ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో ఉన్న ఆగ్ర హీరోలతో కలిసి నటించి మెప్పించింది. అయితే ఈ ముద్దుగుమ్మ కి సక్సెస్ అంత ఈజీగా రాలేదు. హీరోయిన్గా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ వచ్చింది. అదే సమయంలో ఈమె హీరోయిన్గా నటించిన  'ఆపరేషన్ జావా', 'కోకో' వంటి సినిమాల్లో ఈమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అలా మలయాళ చిత్ర పరిశ్రమలో మమిత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. ఈ ఏడాది మొదట్లో ప్రేక్షకుల‌ ముందుకు వచ్చిన ప్రేమలు మూవీతో సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే.
ఈ ముద్దుగుమ్మ మలయాళం లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా జీవి ప్రకాష్ తో కలిసి రెబల్ అనే మూవీతో అక్కడ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ మమితకు మరో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌కు జంటగా నటించే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏకంగాా దళపతి విజయ్‌తో కలిసి ఆయన 69వ సినిమాలో నటించడానికి రెడీగా ఉంది. ఇక ఇదే క్రమంలో ఆమెకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. మమత బైజు కేరళలోని కిడంగూర్ లో జన్మించింది. ఆమె తండ్రి డాక్టర్. యుక్త వయసులోనే ఈ బ్యూటీ యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పటికీ తల్లిదండ్రుల ఒత్తిడితో చదువును కంటిన్యూ చేసింది. అయితే సినిమాలలో సక్సెస్ అయినప్పటికీ చదువును మాత్రం పక్కన పెట్టలేదు.  మమత బైజు కొచ్చిలోని సీక్రెట్ హార్ట్ కాలేజీలో సైకాలజీలో బీఎస్సీ చేస్తోంది. 16 సంవత్సరాల వయసులోనే ఈ బ్యూటీ 'సర్వరి పాలక్కారన్' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సూర్య, బాలా సినిమాలో ఛాన్స్ దక్కినప్పటికి విబేధాల కారణంగా ఆ సినిమాకు గుడ్ బై చెప్పింది. అత్యధిక వసూళ్లు చేసిన ఎనిమిదో భారతీయ చిత్రం 'ప్రేమలు'తో 24 ఏళ్ల వయసులోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన అతి తక్కువ మంది హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: