హీరోల్లారా సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడితే స‌మంత‌కు న్యాయం జ‌ర‌గుద్దా... ఈ ప‌ని చేయాల్సిందే..!

RAMAKRISHNA S.S.
( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

- ఓ కామెంట్ పెట్టి చేతులు దులుపుకుంటే స‌రికాదు
- ప్ర‌భుత్వంలో చ‌ర్చ‌లు... చ‌ర్య‌లు తీసుకునే వ‌ర‌కు పోరాటం చేయాలి
- దూరంగా ఉన్న హీరోలు ఒక్క తాటిమీద‌కు రావాల్సిందే
కొండా సురేఖ, సమంత విషయంలో టాలీవుడ్ ముక్తకంఠంతో ఒక్క తాటి మీదకు వచ్చింది. దుర్మార్గపు మాటల దాడులను ముక్తకంఠంతో వ్యతిరేకిస్తాం అని మెగాస్టార్ చిరంజీవి, వ్యక్తిగత విషయాలని రాజకీయాల కోసం వాడుకోవటం నిజం.. మరోసారి ఇలా జరిగితే ఊరుకోం అంటూ ఎన్టీఆర్, భాద్య‌త‌గ‌ల పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదు అంటూ నాని, వీరు మాత్రమే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక‌ధీరుడు రాజమౌళి, విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలా ప్రతి ఒక్కరు ఖండ ఖండాలుగా ఖండిస్తూ ప్రకటనలు రిలీజ్ చేస్తున్నారు. సానుభూతి మాటలు చెబుతున్నారు. సమంతకు, అటు అక్కినేని ఫ్యామిలీకి ధైర్యం చెబుతున్నారు.

ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి తర్వాత ఏంటి..? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా..? అంటే అస్సలు సరిపోదు. అంతకుమించి చేయాలి. ఇది కేవలం సమంత కోసం మాత్రం కాదు.. టాలీవుడ్ సినిమా పరిశ్రమ కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కండన ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుంటే.. రేపు మరొకరు ఇండస్ట్రీలో మరో హీరో లేదా హీరోయిన్ మీద రాయి వేస్తారు. మరో పెద్ద కుటుంబం పై ఇంతకంటే పెద్ద ఆరోపణ చేస్తారు. ఆల్రెడీ గతంలో మెగా, నందమూరి ఫ్యామిలీలపై ఇలాంటి దారుణ కామెంట్లు చేశారు కూడా. ఇప్పుడు ఒక ప్రకటన విడుదల చేసి ఇండస్ట్రీ అంతా ఒకే తాటి మీదకు వచ్చింది అనుకోవటానికి వీలు లేదు. వీరంతా కలిసి ముఖ్యమంత్రిని కలవాలి. సదర మంత్రిపై చర్యలకు డిమాండ్ చేయాలి.

ఆ చర్యలు అమలయ్యే వరకు ఏదోలా నిరసన తెలియజేయాలి. పైగా అంటి ముట్టనట్టు ఉంటున్న మిగిలిన హీరోలు కూడా.. చేయి చేయి కలపాలి. అలా జరిగితే సమంతకు మాత్రమే కాదు ఇండస్ట్రీ అంతటికి న్యాయం జరిగినట్టు అవుతుంది. భవిష్యత్తులో మరో అమ్మాయి పరిశ్రమంలోకి రావాలంటే వాళ్లకు ఒక భరోసాగా నిలవాలి. మహిళలకు తెలుగు సినిమా పరిశ్రమ మంచి సేఫ్ అన్న ఫీలింగ్ కలగాలి. పరిశ్రమ బాగు కోసం చాలామంది ఇండస్ట్రీ పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇది పరిశ్రమలో మంచి కోసం జరుగుతున్న పని. ఇప్పుడు ఇలాంటి విషయాలపై అందరూ ఒకే తాటి మీదకు వచ్చి ప్రభుత్వాన్ని కలిసి డిమాండ్ చేసి చర్యలు తీసుకునేలా చేస్తేనే.. అప్పుడు న్యాయం జరిగినట్టు అవుతుంది. మరి మన టాలీవుడ్ హీరోలు ఆ పని చేస్తారో.. లేదో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: