కాంగ్రెస్‌కు అక్కినేని ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్.. నాగ్‌ vs రేవంత్ ఎక్కడ చెడింది..!

Amruth kumar
ఇక మన తెలుగు చిత్ర  పరిశ్రమకు రెండు కళ్ళగా ఇప్పటికీ పూజిస్తున్న అగ్ర‌ నటులలో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఒకరు.. ఇక నటరత్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన కూడా ఎన్టీఆర్‌ను బ్రదర్ అని పిలిచే నాగేశ్వరరావు పార్టీకి మద్దతు ఇవ్వలేదు .. మరోవైపు ఏఎన్నాఆర్ కు కాంగ్రెస్ పార్టీ నేతలతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ వచ్చేవారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ అన్నపూర్ణ స్టూడియో స్థలం వివాదం నేపథ్యంలో ఆ స్టూడియో కు సంబంధించిన గోడలను కూల్చడం ఆ రోజుల్లో పెను దుమారం రేపింది.

ఆ తర్వాత అయినా  ఒకప్పుడు ఎంతో దగ్గరగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆయన కొడుకు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ చెరువులో అక్రమంగా నిర్మించారంటూ కూలగొట్టింది.. ఒకరకంగా రేవంత్ గౌర్నమెంట్ నాగార్జునను టార్గెట్ చేయడం.. ఇటు సిని రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి నాగార్జున ఫ్యామిలీ ఎందుకు టార్గెట్ అయింది? మొన్న N కన్వెన్షన్ కూల్చివేత నేడు సమంత - నాగచైతన్య విడాకుల ఇష్యూ పై కాంగ్రెస్ రచ్చ చేయడానికి కారణాలేమిటి ? ఇదే చర్చ ఇప్పుడు టాలీవుడ్ తో పాటు  పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు వచ్చినప్పటి నుంచి అక్కినేని కుటుంబాన్ని తప్ప మరెవరిని టార్గెట్ చేసినట్లు కనిపించడం లేదు.

ఈ ఇష్యూ కాంగ్రెస్ పార్టీలో కొందరికి అసలు నచ్చటం లేదని కూడా సమాచారం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక ఎవరి హస్తం ఉందనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్‌కు చెందిన ఓ బ‌డా ఫ్యామిలీ పై ఇంత కక్ష సాధింపులు ఏంటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు నాగచైతన్య - సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను సంచలంగా మారి కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో నెట్టింది. రాజకీయాల కోసం మరి ఇంతలా దిగజారి పోవాల అంటూ సోషల్ మీడియాలో ప్రజలు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: