ఈ స్టైలిష్ విలన్ వైఫ్ చిరు- బాల‌య్య తో కలిసి నటించినన హీరోయిన్.. ఆమె ఎవరు అంటే..!

Amruth kumar
మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీగా వచ్చిన ఖైదీ నెంబర్ 150 మూవీ లో స్టైలిష్ విలన్ గుర్తున్నాడా ? అప్పటికే పలువుంది కమల సినిమాలో నటించిన ఈ నటుడు.. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . ఆ తర్వాత వరుస తెలుగు సినిమాల్లో నటించి స్టైలిష్ విల‌న్‌గా  గుర్తింపు తెచ్చుకున్నాడు.  ‘జయ జానకీ నాయకా’, ‘కాటమ రాయుడు’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘అర్జున్ సురవరం’ వంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ పోషించిన తరుణ్ అరోరా తన వెర్సటైల్ నటనతో మెప్పించాడు .
అయితే ఈ స్టైలిష్ విలన్ భార్య ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనే విషయం చాలామందికి తెలియదు. తెలుగు స్టార్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ లాంటి హీరోలతో కలిసి  నటించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనేది ఇక్కడ తెలుసుకుందాం. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు అంజలా జావేరి.. 2000వ దశకంలో ఈ బ్యూటీ టాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఆరాధ్య దేవత. వెంకటేష్ హీరోగా నటించిన ‘ప్రేమించుకుందాం.. రా’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ‘దేవి పుత్రుడు’, ‘చందమామ రావే’, ‘చూడాలనివుంది’, ‘నరసింహనాయుడు’, ‘భలేవాడివి బాసు’ వంటి సూపర్ హిట్ సినిమాలో న‌టించింది .
అలా  వరుసగా సినిమా అవకాశాలు వస్తున్న స‌మ‌యంలోనే  హీరోయిన్ అంజల జవేరి , తరుణ్ అరోరాను పెళ్లి చేసుకుని.. సినిమాలకు గుడ్ బై చెప్పింది. అంజల జవేరి చివరిగా 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అనే చిత్రంలో నటించింది.  ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే.. అంజల జవేరి తరుణ్ అరోరా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీరి పెళ్లయి 6 ఏళ్ళు గడిచాయి కానీ ఇంకా పిల్లలు కలగటం లేదు అని ఆవేదన చెందుతున్నారట . ఈ విషయాన్ని తరుణ్ ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా చెప్పారు . ఇక కెరియర్ పరంగా చూస్తే .. ఇద్దరూ మంచి అవకాశాలు అందుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: