నైజాంలో సాలిడ్ జంప్ కొట్టిన ఎన్టీఆర్ దేవ‌ర‌... 6వ రోజు వ‌సూళ్లు చూస్తే దిమ్మ‌తిరిగి పోద్ది...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ... మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తాజాగా న‌టించిన సినిమా దేవ‌ర‌. త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 304 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక ఆరు రోజుల‌కు క‌లిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో రు. 100 కోట్ల కు పైగా షేర్ రాబ‌ట్టింది. ఇక తొలి రోజు అర్ధ‌రాత్రి షోలు ప‌డిన త‌ర్వాత మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా త‌ర్వాత స్లో పాయిజ‌న్ లా మెల్ల మెల్ల‌గా ఫిక‌ప్ అవుతూ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దేవ‌ర దూసుకు పోయింది.

ఇక ఎన్టీఆర్ కెరీర్ లోనే సోలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా వీక్ డేస్ లోకి వచ్చాక కూడా దుమ్ము లేపుతుంది. మరి నిన్న గాంధీ జయంతి హాలిడే దేవరకి బాగా వర్కౌట్ అయ్యినట్టుగా క‌లెక్ష‌న్ల లెక్క‌లు చెపుతున్నాయి. ఇలా ఆరవ రోజు సాలిడ్ జంప్ ని దేవర తీసుకోగా నైజాం మార్కెట్ లో లేటెస్ట్ వసూళ్లు చూస్తే మైండ్ పోయేలా ఉంది.

ఇక ఐదో రోజు దేవ‌ర నైజాం మార్కెట్ లో రు.  2.37 కోట్ల షేర్ ని అందుకుంటే 6వ రోజు 3.71 కోట్ల షేర్ ని అందుకుని క‌ళ్లు బైర్లు క‌మ్మేలా చేసింది. నిన్న ఒక్క రోజే దేవ‌ర నైజాం వ‌ర‌కు చూస్తే కోటిన్నర మేర ఎక్స్ట్రా షేర్ ... రాబట్టింది.. ఇక‌ మొత్తం 6 రోజుల్లో దేవర 41.46 కోట్ల షేర్ మార్క్ అందుకొని నైజాంలో నాన్ స్టాప్ గా దూసుకెళ్తుంది. ఈ సినిమాను నైజాంలో నిర్మాత .. దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. రూ. 42 కోట్ల‌కు ఈ సినిమా నైజాం రైట్స్ సొంతం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: