కేటీఆర్ ని విమర్శించడం కోసం అక్కినేని ఫ్యామిలీని, సమంతని వాడి నీచరాజకీయాలకు తెర లేపిన కొండా సురేఖకు కొంతమంది మద్దతు తెలిపితే మరి కొంత మంది ఆమెపై ఫైర్ అవుతున్నారు. అయితే ఎక్కువ శాతం మంది కొండా సురేఖని విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు ఆ ఫ్యామిలీతో పాటు సమంతకి కూడా సారీ చెప్పాలని సమంతకి అక్కినేని ఫ్యామిలీకి సపోర్ట్ గా స్పందిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఈ రచ్చ జరుగుతున్న వేళ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు మరోసారి మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి. నట్టి కుమార్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సురేఖ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సురేఖ మాట్లాడిన దాంట్లో కొంతవరకు నిజం ఉంది. అందుకే ఆమెకు నేను సపోర్ట్ చేస్తున్నాను. బీఆర్ఎస్ హయాంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేస్తామని నోటీసులు పంపారు.కానీ ఆ తర్వాత రెండు టర్మ్ లు అధికారంలో ఉన్నా కూడా ఎందుకు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఒక ఇటుక కూడా కదిలించలేకపోయారు. ఇందులో కొన్ని అనుమాన పడాల్సిన విషయాలు ఉన్నాయి.
అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు బయటకు తీసి చాలామంది పేర్లు బయటికి తీశారు.కానీ ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే వీరందరికీ క్లీన్ చీట్ వచ్చింది. అయితే ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న వారిలో ఒక్కరు కూడా మాపై తప్పుడు ఆరోపణలు చేశారు అని కంప్లైంట్ చేయలేదు. అయితే అంతమంది డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నట్టు పేర్లు బయటపడితే ఒక్కరు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు రాకపోవడం అనుమానించాల్సిన విషయమే. ఇక కేటీఆర్ సమంతని రమ్మన్నారు అనే దానికి నాగార్జున కోడల్ని కేటీఆర్ దగ్గరికి పొమ్మన్నారు అంటూ సురేఖ మాట్లాడిన దాంట్లో ఎంత నిజముందో నాకు తెలియదు. కానీ ఆధారాలు లేకుండా సురేఖ ఆ మాటలు మాట్లాడదు. అయితే తెలియని దాని గురించి నేను మాట్లాడను. ఇక సురేఖ దగ్గర ప్రూఫ్స్ ఉంటే అవి బయట పెట్టాలి.అలాగే సమంత స్పందించిన దానికి కూడా ప్రూఫ్స్ ఉంటే ఇద్దరు లీగల్ గా వెళ్లాలి వారి విషయాలను వాళ్లే చూసుకోవాలి.ఈ విషయంలో నేను వేలు పెట్టను.
కానీ సురేఖ చెప్పిన దాంట్లో కొంతవరకు అయితే నిజం ఉంది. ఇన్ని రోజులుగా రాజకీయాల్లో ఉన్న కొండా సురేఖ ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అని నేను అనుకోవడం లేదు.ఆమె దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టాలి.అలాగే కేటీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఎంతో మంది సినిమా ఇండస్ట్రీ వాళ్లకు దగ్గరయ్యారు. ఎవరికీ ఏ కష్టం వచ్చినా ఈయనకే ఫోన్ చేసేవారు.వాళ్ల ఇంట్లో జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్ కి ఈయన వెళ్లేవారు. అయితే ఈ విషయంలో అనుమాన పడాల్సిన విషయాలు మాత్రం చాలానే ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నిర్మాత నట్టి కుమార్ మద్దతుగా మాట్లాడడం ప్రస్తుతం అందరిని షాకింగ్ కి గురిచేసింది. అయితే ఈయన మాటల పై చాలా మంది సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా గుర్రుగా ఉన్నారు. ఇక ఈయన ఇంటర్వ్యూ చూసిన అక్కినేని ఫ్యామిలీ అభిమానులు అయితే ఆయనను ఓ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా అని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు