కొండా సురేఖ వ్యాఖ్యలపై.. చిరంజీవి ఘాటు రియాక్షన్..!

Divya
తెలంగాణ మంత్రి కొండా సురేఖ నిన్నటి రోజున కేటీఆర్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.. ముఖ్యంగా సమంత, చైతన్య లను ఉద్దేశించి చేసిన వాక్యాలు తీవ్రమైన ఆరోపణలకు గురిచేసాయి.. ఈ విషయం పైన అటు సినీ సెలెబ్రిటీలే కాకుండా రాజకీయ నాయకులు కూడా మంత్రి కొండా సురేఖ పైన ఫైర్ అయ్యారు. అలాగే అక్కినేని కుటుంబం ,సమంత, టాలీవుడ్ సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా ఈ విషయం పైన స్పందిస్తూ సురేఖ వ్యాఖ్యాలను విమర్శిస్తూ పలు రకాల ట్విట్లు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయం పైన ఘాటుగానే స్పందించినట్లు కనిపిస్తోంది.

చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ నుంచి కొండా సురేఖ వ్యాఖ్యల పైన.. గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు తనకు చాలా బాధను కలిగించాయని సెలబ్రెటీలు సినిమా వ్యక్తులను వారి యొక్క పాపులారిటీ కోసమే వాడుకోవడం చాలా సిగ్గుచేటు అంటూ మా సినీ పరిశ్రమ పైన వారి యొక్క సభ్యుల పైన ఇలాంటి దుర్మార్గపు మాటలను మాట్లాడడం వ్యతిరేకిస్తున్నామంటూ సంబంధం లేని వ్యక్తులను మహిళలను రాజకీయాలలోకి లాగడం సరైన పద్ధతి కాదు ఇలాంటి వ్యాఖ్యలు చాలా అసహ్యకరమైన వ్యాఖ్యలు అంటూ ఫైర్ అయ్యారు.

సినీ సెలబ్రిటీలను రాజకీయంగా ఉపయోగించుకునేలా దిగజారిపోయారు.. సమాజానికి ఏదైనా ఉపయోగపడే పనులు చేయాలి కానీ ఇలాంటి కలుషితమైన మార్గాలను ఎంచుకోకూడదు అంటు ఫైర్ అయ్యారు చిరంజీవి. గౌరవ స్థానాలలో ఉన్న వ్యక్తులు ప్రజలకు మంచి ఉదాహరణలుగా ఉండాలి ఇలాంటి హానికరమైన వ్యాఖ్యలు ఉపసంకరించుకోవాలి అంటూ చిరంజీవి ట్విట్ చేశారు. అయితే ఈ విషయం పైన ఇటీవలే కొండా సురేఖ కూడా సమంతకు క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా తెలియజేసింది. అయినప్పటికీ కూడా ఈ విషయం పైన ఇప్పటికీ చాలామంది స్పందిస్తూనే ఉన్నారు. మరి ఇక మీదట సినీ సెలబ్రిటీల జోలికి నాయకులు వెళ్లకుండా ఉండేలా చూసుకుంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: