రవితేజని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా 'ఇడియట్' ?

Veldandi Saikiran
* సైడ్ హీరో పాత్రల్లో మెరిసి.. స్టార్ హీరోగా రవితేజ
* మాస్ మహారాజ్ గా గుర్తింపు
*  చంటిగాడు లోకల్  అంటూ  'ఇడియట్' తో రచ్చ
* పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన మూవీతో రవితేజ సక్సెస్

 టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న మాస్ మహారాజ్ రవితేజ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మాస్ ఫాలోయింగ్ అలాగే, ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న హీరో రవితేజ. మెగాస్టార్ చిరంజీవి తర్వాత..  ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చిన వారిలో రవితేజ మొదటి వరుసలో ఉంటాడు. సైడ్ పాత్రలు చేసుకుంటూ.. ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. దాదాపు 75 సినిమాలు చేసిన మాస్ మహారాజు రవితేజ.. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు.
అయితే... హీరో సైడ్ క్యారెక్టర్ల పాత్రలో.. మెడిసిన రవితేజ.. కెరీర్ ను మార్చింది ఇడియట్ సినిమా. ఇప్పటికీ కూడా ఇడియట్ సినిమా టీవీల్లో వచ్చింది అంటే జనాలు ఎగబడి చూస్తారు. ఈ సినిమాలో రవితేజ చెప్పే చంటిగాడు లోకల్.. అనే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఊర మాస్ యాంగిల్ లో కనిపించిన మాస్ మహారాజు రవితేజ... డాన్స్ అలాగే యాక్టింగ్ లో ఇరగదీశాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
 అప్పటికే శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా  పూరి జగన్నాథ్ అలాగే రవితేజ కాంబినేషన్లో వచ్చింది. ఇడియట్ సినిమా కథను పవన్ కళ్యాణ్ కు అప్పటికే పూరి జగన్నాథ్ వినిపించారట. కానీ ఊర మాస్ పాత్ర ఉందని పవన్ కళ్యాణ్ సింపుల్ గా రిజెక్ట్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంకేముంది..  ఈ కథను రవితేజ వద్దకు తీసుకుపోగా... వెంటనే పూరి జగన్నాథ్ కు ఓకే చెప్పాడట.
 2002 సంవత్సరం ఆగస్టులో రిలీజ్ అయిన ఈ సినిమా.. నడుస్తుందో లేదో అనే టెన్షన్ అందరిలో ఉన్న సమయంలో... బంపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించగా రక్షిత హీరోయిన్గా నటించింది. పోలీస్ కమిషనర్ కూతుర్లకు మొగుళ్ళు రారా? అంటూ రవితేజ ఈ సినిమాలో చెప్పే డైలాగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ ఇడియట్ సినిమా కన్నడలో అప్పు పేరుతో రిలీజ్ చేస్తే బంపర్ హిట్ అయింది. మొత్తానికి రవితేజ కెరీర్ ను ఇడియట్ సినిమా మార్చేసిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: