సిమ వంకాయలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు...!
అయితే, ఇటీవలి కాలంలో కొంత రుచుల్లో ఈ కూరగాయ కూడా ప్రాచుర్యం పొందింది. ఈ కూరగాయకు ప్రత్యేకమైన రుచి మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సియ వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. త్వరగా కడుపు నిండిపోయేలా చేస్తుంది. ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా పొట్టను నిండుగా ఉంచుతుంది. సియ వంకాయలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల, ఇది రక్తపోటు నియంతరణకు సహాయపడుతుంది. శరీరానికి కావాల్సిన శక్తిని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సియ వంకాయ లోని పోషకాలు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనిని ఆహారంలో చేర్చుకుంటే గుండె ఆరోగ్యం పెరుగుతుంది.
గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇందులో విటమిన్ C, విటమిన్ K, ఫోలేట్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సియ వంకాయలో ఫ్లావనాయిడ్లు, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి, క్యాన్సర్ వంటి తీవ్రమైన రోగాల నుండి రక్షణా కల్పిస్తాయి. ఈ కూరగాయలు యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి, అవి చర్మానికి కావాల్సిన పోషణను అందించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.