దేశంలో నాన్ స్టాప్ గా ఎక్కడా ఆగకుండా గమ్యస్థానికి చేరే రైలు గురించి మీకు తెలుసా?
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు అత్యంత వేగంగా ప్రయాణీకులను గమస్య స్థానాలకు చేర్చడంలో ఈ ట్రైన్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి తేనున్నారు. మరోవైపు బుల్లెట్ రైళ్లు, హైడ్రోజన్ రైళ్లు కూడా పట్టాలెక్కబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే దేశంలో కొన్ని రైళ్లు అయితే తమకంటూ కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి "ముంబై – హపా దురంతో ఎక్స్ ప్రెస్" ఒకటి. విషయం ఏమిటంటే... దేశంలో ఎక్కువ దూరం నాన్ స్టాప్ గా వెళ్లే రైలుగా ఇది గుర్తింపు సాధించింది.
ఈ రైలు మార్గ మధ్యంలో కేవలం 3 స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. అంతేకాదండోయ్... ట్రైన్ బయల్దేరిన స్టేషన్ నుంచి ఆగకుండానే నాన్ స్టాప్ గా 493 కిలో మీటర్ల మేర ప్రయాణిస్తుంది. అందుకే ఈ రైలు ఆగకుండా ఎక్కువ దూరం జర్నీ చేసే నాన్ స్టాఫ్ రైలుగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ రైలు ప్రతి రోజు రాత్ర 11 గంటలకు ముంబైలో బయల్దేరి, నాన్ స్టాఫ్ గా 493 కిలో మీటర్ల దూరం ప్రయాణించి, తెల్లవారుజామున 4.50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. ఆ తర్వాత మరో 2 స్టేషన్లలో ఆగి హపాకు వెళ్తుంది. ఇక ముంబై – హపా రైలు తర్వాత చెప్పుకోదగ్గది... "పుణె హౌరా దురంతో ఎక్స్ ప్రెస్." ఇది కూడా నాన్ స్టాఫ్ గా ఎక్కువ దూరం ప్రయాణించే రెండో రైలుగా గుర్తింపు తెచ్చుకుంది.