టైమ్-ట్రావెల్ జానర్‌ను ఇండియాకి పరిచయం చేసిన బాలయ్య.. అదే అందరికీ ఫేవరెట్..??
* అదే ఆదిత్య 369
* ఈ సినిమా ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఫేవరెట్
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో ఒక సినిమా అందరికీ ఫేవరెట్ గా నిలిచింది. అదే "ఆదిత్య 369". దాదాపు 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇండియాలోనే మొదటి ‘టైమ్ ట్రావెల్’ సినిమాగా పేరు తెచ్చుకుంది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాని తెరకెక్కించారు. ఇది ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా చూశారు థియేటర్లకు దీన్ని చూసేందుకు పోటెత్తారు. సినీ క్రిటిక్స్ కూడా ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. కానీ, ఒక విషయం ఏంటంటే, ఈ సినిమా వచ్చిన కాలంలో హాలీవుడ్‌లో కూడా ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ సినిమాలు వచ్చాయి. అవి కూడా టైమ్ ట్రావెల్ గురించే. అందుకే కొంతమంది ఆదిత్య 369 సినిమాని బ్యాక్ టు ది ఫ్యూచర్ సినిమాలను కాపీ చేసిందని అనుకున్నారు.
సింగీతం శ్రీనివాసరావు బ్యాక్ టు ది ఫ్యూచర్ సినిమాలను కాపీ చేశారని కొందరు అనుకున్నారు. కానీ, ఆయన ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూలలో తిరస్కరించారు. ఆయన చెప్పినట్లుగా, చిన్నప్పుడు రచయిత హెచ్.జి. వెల్స్ రాసిన ది టైమ్ మెషిన్ నవల చదివి ముగ్ధుడయ్యాడు. ఆ నవల నుంచి ప్రేరణ పొంది తర్వాత సినిమా తీయాలని నిర్ణయించుకున్నారట. సింగీతం మాట్లాడుతూ తన సినిమాకి, బ్యాక్ టు ది ఫ్యూచర్ సినిమాలకి ఉన్న పోలికలు చాలా తక్కువ అని స్పష్టం చేశాడు. బ్యాక్ టు ది ఫ్యూచర్ సినిమాల్లో టైమ్ ట్రావెల్ కోసం స్పేస్ సిద్ధాంతాలను వాడారు. అయితే, ఆదిత్య 369 సినిమాలో సమయం గురించిన సిద్ధాంతాన్ని మాత్రమే ఉపయోగించారు.
ఇక ఈ సినిమా కథ ఏంటంటే, ప్రొఫెసర్ రామదాస్ (టిన్ను ఆనంద్) అనే ఓ శాస్త్రవేత్త టైమ్ మెషిన్‌ని తయారు చేస్తారు. దానితో గతం, భవిష్యత్తులకు వెళ్లవచ్చు. ఆయనే హీరోయిన్ హేమ (మోహిని) తండ్రి. రామదాస్ చాలా ధీమాతో చెప్పినా, మెషిన్ మొదట్లో పని చేయదు. అయితే, కొంతమంది పిల్లలు దొంగతనాన్ని ఆపాలని గతంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నప్పుడు, ఆ మెషిన్ అనుకోకుండా పని చేస్తుంది. ఆ పిల్లలను కాపాడాలని ప్రయత్నిస్తూ, కృష్ణకుమార్ (బాలకృష్ణ), హేమలు మెషిన్‌లో లాక్ అయి పోయి 1526 AD కాలానికి వెళ్లిపోతారు. అక్కడ శ్రీకృష్ణదేవరాయ (బాలకృష్ణ) రాజ్యంలో జరిగే సాహసయాత్రే సినిమా కథ!
ఇక కృష్ణకుమార్ కు టైమ్ మెషిన్‌ని ఎలా నడపాలో తెలియదు. అందువల్ల, తన యుగం తిరిగి వెళ్లాలని ప్రయత్నిస్తున్నప్పుడు, అనుకోకుండా భవిష్యత్తులో 2500 సంవత్సరానికి వెళ్లిపోతాడు. తర్వాత సినిమా మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈ సినిమా ఒక అద్భుతం. ఎందుకంటే ఇందులో సైన్స్ ఫిక్షన్‌ని, డ్రామాని, పాటలని, ఫైట్ సీన్లని అద్భుతంగా మిళితం చేశారు. అంటే సినిమా చూసే ప్రతి ఒక్కరికీ నచ్చేలా చేసింది. అంతేకాకుండా, ఈ సినిమా ఆల్బర్ట్ అయిన్‌స్టీన్ చెప్పిన సమయం, బ్రహ్మాండం గురించిన సిద్ధాంతాలను చాలా మందికి తెలియజేసింది. అంటే, ఈ సినిమా చూసిన వాళ్ళంతా మన కళ్ళకు కనిపించే ప్రపంచం కంటే ఎంతో పెద్ద ప్రపంచం ఉందని తెలుసుకున్నారు. ఈ సినిమాలో ఇళయరాజా కంపోజ్ చేసిన నెరజాణవులే పాట కూడా సూపర్ హిట్ అయింది. ఈ మూవీకి ముగ్గురు కెమెరా పర్సన్స్ ఓపెన్ చేశారు వారిలో ఒకరు భూతకాలం మరొకరు వర్తమానం ఇంకొకరు భవిష్యత్తు కాలం సన్నివేశాలను క్యాప్చర్ చేశారు.