జాన్వీ కపూర్ : కోట్లు ఇచ్చిన అలాంటి రోల్స్ చస్తే చేయను.. అమ్మ ముందే చెప్పింది..!!

murali krishna
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదా.. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ తనదైన నటనతో ఎంతగానో అలరించింది.. జాన్వీ హిందీలో సూపర్ సక్సెస్ లు అందుకోకపోయిన మంచి నటిగా గుర్తింపు పొందింది.. ఇటీవల ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.. జాన్వీ తల్లి శ్రీదేవికి టాలీవుడ్ తో ఎంతటి అనుబంధం వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. దీనితో జాన్వీ కూడా టాలీవుడ్ లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంది.. అయితే తాజాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీలో జాన్వీ హీరోయిన్ గా నటించింది..ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది..ఈ మూవీ ఇప్పటికే 80 శాతానికి పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

దేవర సినిమా సాధించిన కలెక్షన్ల విషయంలో ఈ సినిమా నిర్మాతలు సైతం సంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ తాజాగా అమ్మకు ఇచ్చిన మాట గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఏ సినిమాలో అయినా జుట్టు లేకుండా నటించే రోల్ లో నటించే పరిస్థితి ఉంటే తాను నటించబోనని ఆమె తెలిపారు.అలాంటి రోల్స్ కు నేను అసలు చేయను అని ఆమె చెప్పుకొచ్చారు. నా జుట్టు కట్ చేసుకోవడానికి నేను ఇష్టపడనని పాత్ర కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా నేను సిద్ధమని జాన్వీ తెలిపింది.. అయితే దఢక్ సినిమా కోసం జుట్టు కట్ చేసుకుంటే అమ్మ సీరియస్ అయిందని ఆమె చెప్పుకొచ్చారు. అమ్మ జుట్టు కట్ చేసుకోవద్దని చెప్పిన నేపథ్యంలో అమ్మ మాటను నేను వింటానని ఆమె పేర్కొన్నారు.పాత్రల కోసం జుట్టు కట్ చేసుకోవాల్సి వస్తే నన్ను సంప్రదించవద్దని ఆమె చెప్పుకొచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: