కన్నడ ఇండస్ట్రీపై ఎన్టీఆర్ కన్ను.. బెంగళూరు వేదికగా భారీ ప్లాన్..!

Amruth kumar
దేవర సినిమాతో ఎన్టీఆర్ లెవెల్ మారిపోయింది. ఎవరు ఎన్ని విధాలుగా టార్గెట్ చేసిన దేవర కలెక్షన్ జాతర ఓ రేంజ్ లో  దూసుకుపోతుంది. సినిమాపై నెగటివ్ టాక్ ఏ రేంజ్ లో వచ్చిన సరే దేవర ఎక్కడ తగ్గటం లేదు. సినిమాపై ఉన్న అంచనాలకు వసూళ్లకు సరిగ్గా సెట్ అయింది. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇక ఎన్టీఆర్ కు కూడా ఈ సినిమా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.  ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాలుకు తెలుగు రాష్ట్రాల్లోనే మార్కెట్ భారీగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఇతర భాషల్లో కూడా ఓ రేంజ్ లో పెరిగింది.
మరి ముఖ్యంగా కన్నడలో ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూశారు. కొన్నిచోట్ల బ్లాక్ లో కూడా దేవర టిక్కెట్లు 3000 వరకు అమ్ముడు అయ్యాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంది .. ఇక ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలో కన్నడ ఇండస్ట్రీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు తన త‌ల్లితో కలిసి ఎన్టీఆర్ కర్ణాటక కూడా వెళ్లి పలు ఆలయాలు తిరిగి వచ్చాడు. అక్కడ ద‌ర్శ‌కులు, హీరోలతో ఎక్కువ మమేకమవుతున్నాడు. ఇప్పుడు కన్నడ మార్కెట్ నీ దృష్టిలో పెట్టుకుని బెంగళూరులో ఒక భారీ ఫ్లాట్ కూడా కొనడానికి రెడీ అయ్యాడట ఎన్టీఆర్.
ఖరీదైన ప్రాంతంలో ఫ్లాట్ ను ఇప్పటికే సెలెక్ట్ చేసినట్టు కూడా సమాచారం. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో ఎన్టీఆర్ ఫ్లాట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ చదరపు అడుగు 14 వేల వరకు ఉంది. ఇందిరా నగర్ లో కూడా ఎన్టీఆర్ ఫ్లాట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సీబీడీకి కర్ణాటక అసెంబ్లీకి ఆరు కిలోమీటర్లు ఉంటుంది. అక్కడే ఎక్కువగా ధనవంతులు కూడా ఉంటారు. అందుకే అక్కడ ఫ్లాట్ కోసం ఎన్టీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తోనే ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ కూడా కన్నడ అమ్మాయి కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: