విశ్వం ట్రైన్ ఎపిసోడ్ ఎన్ని నిమిషాలో తెలుసా.. అంతా టైమ్ హోల్డ్ చేయగలిగితే బ్లాక్ బస్టర్ కొట్టినట్టే అయినట్టే..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం శ్రీను వైట్ల వరుస పెట్టి అపజయాలను అందుకుంటూ వస్తున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత శ్రీను వైట్ల తాజాగా గోపీచంద్ హీరోగా కావ్య దా హీరోయిన్గా విశ్వం అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాను అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా శ్రీను వైట్ల కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ ... నేను దర్శకత్వం వహించిన వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది. అది అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇప్పటికీ కూడా ఆ ట్రైన్ ఎపిసోడ్ అంటే జనాలు ఇష్టపడతారు. ఇక విశ్వం సినిమాలో కూడా ఓ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది. ఇక ఆ ట్రైన్ ఎపిసోడ్ ను కావాలని పెట్టలేదు. అది సినిమా కథలో భాగంగా వస్తుంది. ఇక ఆ సుచివేషన్ లో ట్రైన్ ఎపిసోడ్ వచ్చింది. కాబట్టి అందులో వెంకీ టైప్ కామెడీని మిక్స్ చేయాలి అనుకున్నాను. కానీ వెంకీ సినిమాలో మొత్తం ట్రైన్ ఎపిసోడ్ కామెడీ యాంగిల్ లో ఉంటుంది.

కానీ ఇందులో ఒక టెన్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఇక విశ్వం సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ 40 నుండి 45 నిమిషాల పాటు ఉంటుంది అని శ్రీను వైట్ల చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే 40 నుండి 45 నిమిషాల పాటు ట్రైన్ ఎపిసోడ్ ఉంది అని శ్రీను వైట్ల చెప్పాడు. దీని ప్రకారం ఒక వేళ ట్రైన్ ఎపిసోడ్ కనుక సక్సెస్ అయినట్లయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: