ఆటలో అరటిపండు, కూరలో కరివేపాకు.. పాపం ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ పరిస్థితి ఇలా మారిందేంటి?

praveen
ఎప్పటిలాగానే తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అందరిని కూడా ఆకట్టుకుంటూ.. బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. మునుపటిలా కాకుండా సరికొత్త కాన్సెప్ట్ తో ఇక ప్రేక్షకులను అలరిస్తుంది అని అటు నిర్వాహకులు చెబుతున్న.. పాత చింతకాయ పచ్చడి.. కొత్త రంగేశారు అంటూ కొంతమంది ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. అయితే ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ విషయంలో ఎప్పుడు ఉత్కంఠ ఉంటుంది  

 ఇక గత కొంతకాలం నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీల గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఏకంగా 12 మంది వైల్డ్ కార్డు  ఎంట్రీ ఇస్తారని చెప్పిన బిగ్ బాస్.. దీనిని ఆపేందుకు కంటెస్టెంట్ ఏకంగా బిగ్ బాస్ పెట్టిన గేమ్స్ లో గెలవాలి అంటూ టాస్క్ ఇచ్చాడు. ఇక ఈ టాస్కులు ఎంతో రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి  అయితే ఇదంతా బాగానే ఉన్నా హౌస్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ మాత్రం ఆటలో అరటిపండులా.. కూరలో కరివేపాకులా మారిపోయాడు. ఏ క్లాన్లోకి వెళ్లిన అతన్ని అందరు సభ్యులు అలాగే చూస్తున్నారు.

 అతను ఎవరో కాదు మణికంఠ. గతంలో అతను శక్తి క్లాన్ లో సభ్యులుగా ఉండేవాడు  అయితే ఒకానొక సమయంలో టీమ్ లో ఉన్న అందరిలో ఎవరో ఒకరిని పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసింది. అందరూ కలిసి అటు మణికంఠను పక్కన పెట్టేసారు. దీంతో బయట ఉన్న అతని ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. అయితే ఇక ఇప్పుడు కాంతారా క్లాన్ లోకి వచ్చినప్పుడు అయినా మణికంఠకు ఇంపార్టెన్స్ దక్కుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇక కొత్త క్లాన్ లో కూడా అతనికి ఎక్కడ ఇంపార్టెన్స్ దక్కలేదు. బిగ్బాస్ చెప్పిన ప్రకారం సీత టీం నుంచి ఎవరిని తొలగించాలి అని చర్చల మొదలైంది. తన టీం లో ఉన్న వారందరూ నామినేషన్స్ లో ఉన్నారు. కాబట్టి ఆడటానికి ఛాన్స్ రాని వారికి చాన్స్ ఇవ్వాలని కొందరు సభ్యులు కోరారు. నైనిక, ప్రేరణ, సీత నుండి ఎవరైనా తప్పుకుంటే బాగుంటుంది అని భావించారు. కానీ చివరికి మణికంఠనే టీం నుండి తీసేసారు  నబిల్ మనీకి ఎంత సపోర్ట్ చేయాలని ప్రయత్నించిన.. అతని మాట ఎవరు పట్టించుకోలేదు. సీత క్లాన్ లో అయినా తనకు గుర్తింపు ఉంటుందని భావించిన మణికంఠకు మరోసారి చేదు అనుభవం ఎదురయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: