'దేవర' కోసం కొరటాల ఆ రచయిత హెల్ప్ తీసుకున్నారా..?

murali krishna
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ గత చిత్రం ‘ఆచార్య’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా.. ఆయన కెరీర్ మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. ఆ సినిమా తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పాన్ ఇండియన్ మూవీ ‘దేవర’ను తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకులముందుకు వచ్చింది.ఎన్టీఆర్ ఆర్ట్స్' సమర్పణలో 'యువ సుధా ఆర్ట్స్' బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్  ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. ఆర్.ఆర్.ఆర్'  తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన సినిమా కావడంతోభారీ అంచనాల నడుమ కొంత మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంది.అయితే టాక్ తో సంబంధం లేకుండా ‘దేవర’ మంచి ఓపెనింగ్స్ సాధించింది. మండే టెస్ట్ కూడా పాసయ్యింది అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘దేవర’ చిత్రానికి రూ.174.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.170.25 కోట్ల షేర్ ను రాబట్టి..రికార్డులు క్రియేట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.75 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఈరోజు గాంధీ జయంతి హాలిడే అడ్వాంటేజ్ ఉంది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇదిలావుండగా రాజమౌళితో సినిమా చేసిన హీరో తదుపరి ఫ్లాప్ చవి చూడాల్సిందే అనే సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది. రచయితగా కొరటాల బలం ఈ సినిమాని నిలబెట్టింది. అయితే… 'దేవర' వెనుక ఓ మరో రైటర్ హస్తం కూడా ఉందట. కొన్ని కీలకమైన సన్నివేశాలకు మరో రచయిత సాయం పట్టినట్టు ఇన్ సైడ్  టాక్‌. అతనే శ్రీకాంత్ విస్సా.
కల్యాణ్ రామ్‌ 'డెవిల్' చిత్రానికి రచయితగా పని చేశారు శ్రీకాంత్ విస్సా. ఇప్పుడు కల్యాణ్ రామ్ కోసం కొన్ని కథలు సిద్ధం చేస్తున్నారు. `దేవర`కు కల్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామి. అందుకే స్క్రిప్టు విషయంలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తోంది. శ్రీకాంత్ కూడా కొన్ని సన్నివేశాలకు రాత సాయం అందించారని సమాచారం. స్వతహాగా కొరటాల మంచి రచయిత. తన బలం రైటింగే. అలాంటి రచయిత… మరో రచయిత కథలో ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఇష్టపడరు. కానీ కొరటాల మాత్రం ఎలాంటి ఈగో లేకుండా మరో రచయిత ఐడియాలజీని కూడా ఆహ్వానించడం విశేషమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: