దేవ‌ర వీకెండ్ నెంబ‌ర్లు బాగా వేశారు... మండే టెస్ట్‌లో పాస్ చేస్తారా..?

murali krishna
తెలుగు రాష్ట్రాల్లో దేవర హవా నడుస్తోంది. మొన్న శుక్రవారం రిలీజైన ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన స్టార్ల లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు.భారీ అంచనాల నడుమ విడుదలైన "దేవర" సినిమా మిక్స్డ్ రియాక్షన్స్ తెచ్చుకుంది కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం కళ్ళు చెదిరే రీతిలో కలెక్షన్లు వసూలు చేస్తోంది.కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దేవర మొదటి రోజు భారీ వసూల్లు రాబట్టింది.దేవర సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే కలెక్షన్స్ అప్డేట్ చేసే బాక్స్ ఆఫీస్ పోర్టల్స్ కొన్ని 140 కోట్ల రూపాయల మాత్రమే వచ్చాయని తెలిపాయి. ఆ రెండు నంబర్స్ లో ఏది నిజం అనేది పక్కన పెడితే ఎన్టీఆర్ సత్తా ఏమిటి అనేది మరోసారి ప్రేక్షకులకు తెలిసింది. మిక్స్డ్ టాక్, ఇంకా చెప్పాలంటే గొప్పగా లేని రివ్యూలతో ఆయన మొదటి రోజే 150 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించారు. రెండో రోజు కూడా 'దేవర' సినిమాకు రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చాయి అంటే కారణం ఎన్టీఆరే. రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 243 కోట్లు కలెక్ట్ చేసిందని యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇదిలావుండగా సెప్టెంబరు 27న రిలీజ్ అయిన దేవర మొదటి వీకెండ్ ముగించుకుంది. నేటి నుండి దేవరకు అసలు పరీక్ష మొదలైంది. మొదటి రోజు ఫ్యాన్స్ ఎలాగూ చూస్తారు, ఆ రోజు ఆల్మోస్ట్ థియేటర్స్ హౌస్ ఫుల్స్ తో ఉండడం కామన్. ఇక శని, ఆది వీకండ్ కావడంతో అన్ని ఏరియాలు ఫుల్స్ నడిచాయి. ఇక నాలుగవ రోజు అనగా ఈ సోమవారం నుండి దేవర అసలు పరీక్ష ఎదుర్కోబోతున్నాడు. ఈ రోజు కలెక్షన్స్ హోల్డ్ చేయగలిగితే దేవర ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతాడు. లేదంటే పోరాడాల్సి ఉంటుంది. అటు ఓవర్సీస్ లో సోమవారం అడ్వాన్స్ సేల్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. ఆల్మోస్ట్ క్రాష్ అయిందనే చెప్పాలి. అది దేవర యూనిట్ ను టెన్షన్ పెడుతన్నా నార్త్ బెల్ట్ పుంజుకోవడం కొంత ఊరటనిస్తోంది. ఇదిలా ఉండగా మొదటి రెండు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా రూ. 243 కోట్లు రాబట్టిందని అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ లో 70% కలెక్షన్స్ రికవరీ అయింది.ఈ నేపథ్యంలో ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లిందనడంలో సందేహమే లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర దండయాత్ర సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: