జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ , ఎన్టీఆర్ కి జోడిగా నటించగా , తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీకాంత్ , మురళీ శర్మ , ఈ మూవీ లో ముఖ్యపాత్రలలో నటించగా ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.
ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ మొదటి భాగంలో సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించిన రెండవ భాగంలో మాత్రం కొరటాల ఈ కథ మొత్తాన్ని మలుపు తిప్పనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలోని మొదటి భాగంలో ప్రకాష్ రాజ్ కో కీలకమైన పాత్రలో కనిపించాడు. దేవర పక్కనే ఉంటూ వస్తాడు. ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఈ మూవీ కథను మొత్తం వివరిస్తూ ఉంటాడు.
ఈ సినిమా మొదటి భాగంలో చాలా మంచి వ్యక్తుల దేవర కు అత్యంత ఆప్తుడు పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజు ను రెండవ పాత్రలో విలన్ గా చూపించే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు , అలా చూపించినట్లు అయితే దానిని ఎవరు అస్సలు ఊహించరు అని దానితో అది సినిమాకు సూపర్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది అని ప్రకాష్ రాజ్ ను విలన్ గా పెట్టి వైపు కథను కొరటాల మలుపులు తిప్పబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.